అసోంలోని కరీమ్గంజ్ లోక్‌సభ నియోజకవర్గంలో జోరుగా రిగ్గింగ్ జరిగింది. ఓ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన 467వ బూత్‌లో ఒక్కో వ్యక్తి దాదాపు 15 ఓట్లు వేస్తూ కనిపించారు. ఈ విషయంపై అక్కడి ఎన్నికల అధికారిని ప్రశ్నించగా... తమకు రిగ్గింగ్‌తో సంబంధంలేదన్నారు. ఇలాంటి వారిని అడ్డుకునే బాధ్యత భద్రతా సిబ్బందిదేనని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు.
ప్ర: ఏం జరుగుతోంది ఇక్కడ?
జ: కుటుంబ సభ్యులందరి ఓట్లు ఒకే వ్యక్తి వేస్తున్నారు.ప్ర: ఒక్క వ్యక్తి ఎన్ని ఓట్లు వేశారు?
జ: 15 మందిలో 14 ఓట్లు ఒక్క వ్యక్తే వేశారు.ప్ర: ఈ సంఘటన ఎలా జరిగింది?
జ: మా పని ఇక్కడ పనిని చూసుకోవడం. నేను నా పని చేస్తున్నాను. ఇలాంటి పనులన్నీ భద్రతా సిబ్బంది చూసుకోవాలి.
ఇదీ చూడండి: చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతం