ETV Bharat / bharat

'పౌర' బిల్లు ఆమోదంపై సర్కారు హర్షం.. కాంగ్రెస్​ గరం

పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదిగా నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు కాంగ్రెస్​ మాత్రం బిల్లు ఆమోదంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించింది.

RESPONSES ON CITIZENSHIP AMENDMENT BILL APPROVAL IN PARLIAMENT
'పౌర' బిల్లు ఆమోదంపై భిన్న వాదనలు.. ఎవరేమన్నారంటే?
author img

By

Published : Dec 12, 2019, 6:21 AM IST

Updated : Dec 12, 2019, 7:19 AM IST

కీలకమైన పౌరసత్వ సవరణ బిల్లు-2019కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఓటింగ్‌ సమయంలో సభలో 224 మంది సభ్యులు ఉండగా.. బిల్లుకు అనుకూలంగా 125 మంది, వ్యతిరేకంగా 99 మంది ఓటు వేశారు.

భారత్​లోని పాకిస్థాన్, బంగ్లాదేశ్​, అఫ్గానిస్థాన్​ దేశాల ముస్లిమేతరులకు దేశ పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లును తీసుకువచ్చింది కేంద్రం. బిల్లు ఆమోదంపై ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్​షా సహా సర్కారు హర్షం వ్యక్తం చేసింది. కాంగ్రెస్​ మాత్రం చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించింది. ఆమోదంపై ఎవరేమన్నారంటే..

'మరో మైలురాయి'

MODI TWEET
మోదీ ట్వీట్

భారతదేశానికి ఇది ఒక మైలురాయి. దేశ సౌభ్రాతృత్వానికి ప్రతీక. పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందడం ఆనందంగా ఉంది. బిల్లుకు అనుకూలంగా ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు. ఏళ్లుగా మతపీడనను ఎదుర్కొంటున్న వారికి ఈ బిల్లు ఉపశమనం. - ప్రధాని మోదీ ట్వీట్

'కలలు నెరవేరాయి'

AMITH SHA TWEET
అమిత్​ షా ట్వీట్

పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదంతో ఎన్నోఏళ్ల నుంచి పీడన ఎందుర్కొంటున్న కోట్లమంది కలలు నెరవేరాయి. వారి భద్రతకు, గౌరవానికి భరోసా కల్పించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. మద్దతు పలికిన వారందరికీ ధన్యవాదాలు. - కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ట్వీట్​

'చరిత్రలో చీకటి రోజు'

పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం పొందిన ఈ దినం చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుంది. సంకుచిత భావాలు, మతవైర శక్తులు సాధించిన విజయం ఇది. దేశ మూలాలనే ఈ బిల్లు సవాల్​ చేస్తోంది. - సోనియా గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షురాలు (పత్రికా ప్రకటనలో)

New Delhi, Dec 11 (ANI): Citizenship (Amendment) Bill 2019 passed in Rajya Sabha today, however Shiv Sena staged a walkout. On this Member of Parliament Sanjay Raut said, "My party and I felt that when answers are not given properly then it is not right to either support or oppose the Bill." The CAB 2019 passed with 125 in favour and 105 against the Bill.
Last Updated : Dec 12, 2019, 7:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.