భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా... బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని మమత... ఆటవిక రాజ్యంగా మార్చారని ఆరోపించారు. దీనికి త్వరలోనే ముగింపు పలుకుతామని నడ్డా వ్యాఖ్యానించారు.
బంగాల్లో రాజకీయ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భాజపా కార్యకర్తలకు... నడ్డా సామూహిక పిండ ప్రధానం చేశారు. రాజకీయ హత్యలకు బలైనవారి కుటుంబాలకు తృణమూల్ పాలనలో న్యాయం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"బంగాల్లో (తృణమూల్ ప్రభుత్వం) ఆటవిక రాజ్యం, భయంకర పాలన కొనసాగుతోంది. ఈ గూండా రాజ్యంలో చట్టం, న్యాయం లేవు. మరణించిన భాజపా కార్యకర్తల కుటుంబాలకు న్యాయం జరగలేదు. త్వరలోనే ఈ ప్రభుత్వానికి ముగింపు పలుకుతాం."
-జేపీ నడ్డా, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు
మమతాబెనర్జీకి అధికారంపై మమకారమేకాని, ముందు చూపులేదని నడ్డా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉగ్రవాద ధోరణిలో ప్రతిపక్షాలను బెదిరిస్తోందని ఆరోపించారు.
ఇదీ చూడండి: ఉగ్రవాదుల ఏరివేత సక్సెస్.. సైన్యం సంబరాలు