ETV Bharat / bharat

'జీఎస్​టీ బకాయిలు చెల్లించకుండా కేంద్రం మోసం" - sonia gandhi with cms

మోదీ ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రాలకు జీఎస్​టీ పరిహారం చెల్లించేందుకు మోదీ ప్రభుత్వం నిరాకరించటం వంచన చేయటమేనని ధ్వజమెత్తారు. కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాలతో పాటు బంగాల్, ఝార్ఖండ్ సీఎంలతో జరిగిన భేటీలో ఈ వ్యాఖ్యలు చేశారు సోనియా.

SONIA CMS
సోనియా
author img

By

Published : Aug 26, 2020, 4:36 PM IST

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన భేటీలో జీఎస్​టీ పరిహారంపై మోదీ ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా విమర్శించారు సోనియా. దృశ్యమాధ్యమ వేదికగా జరిగిన ఈ సమావేశంలో బంగాల్, మహారాష్ట్ర, ఝార్ఖండ్​ ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు.

జీఎస్​టీ చెల్లింపులపై..

ఈ భేటీలో రాష్ట్రాలకు జీఎస్​టీ బకాయిలు, జేఈఈ, నీట్​ పరీక్షల నిర్వహణపై చర్చించారు సోనియా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనేక సమస్యలు ఉన్నాయని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అందరమూ సమన్వయంతో ముందుకుపోవాలన్నారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని సకాలంలో చెల్లించటం తప్పనిసరి అని, అయితే అది జరగటం లేదని ఆక్షేపించారు. దీనివల్ల రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.

"2020 ఆగస్టు 11న ఆర్థిక శాఖ స్టాండింగ్ కమిటీ సమావేశంలో రాష్ట్రాలకు పరిహారం చెల్లించే పరిస్థితిలో కేంద్రం లేదని ఆర్థిక శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. సహకార సమాఖ్య విధానానికి జీఎస్టీ ఒక ఉదాహరణ. ఐదేళ్లపాటు పరిహారం చెల్లిస్తామని హామీ ఇస్తేనే రాష్ట్రాలు తమ రాజ్యాంగ అధికారాలను వదులుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు దేశ ప్రజలను కూడా మోదీ సర్కారు మోసం చేస్తుంది."

- సోనియా గాంధీ, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు

అప్రజాస్వామికం..

కొన్ని రంగాల్లో రాష్ట్రాలతో సంబంధం లేకుండా కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు సోనియా. రాష్ట్రాల అభిప్రాయాలు కోరకుండా వ్యవసాయ మార్కెటింగ్, పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ) ముసాయిదా రూపొందించటం అప్రజాస్వామికమని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలు, విమానాశ్రయాలు, రైల్వేల ప్రైవేటీకరణను తప్పబట్టారు. నూతన విద్యావిధానం.. ప్రగతిశీల, లౌకిక, శాస్త్రీయ విలువలకు ఎదురుదెబ్బగా అభివర్ణించారు.

నాలుగు నెలలుగా కేంద్రం జీఎస్​టీ బకాయిలు చెల్లించటం లేదని ఛత్తీస్​గఢ్​ సీఎం భూపేశ్ భగేల్ ఆరోపించారు. పరిస్థితి భయంకరంగా ఉందని తెలిపారు.

ఇదీ చూడండి: 'పెద్దలకు రుణాలు కాదు..పేదలకు డబ్బులివ్వండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.