దిల్లీలోని ఎర్రకోటను ఈ నెల 31 వరకు మూసివేస్తూ పురాతత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రజలకు సందర్శించేందుకు అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాగు చట్టాలను రద్దు చేయాలంటూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే.. మూసివేతకు గల సరైన కారణాలను వెల్లడించలేదు. బర్డ్ ఫ్లూతో అప్రమత్తత చర్యల్లో భాగంగా ఈ నెల 19 నుంచి 22 వరకు కూడా ఎర్రకోటకు సందర్శకులను అనుమతించలేదు. గణతంత్ర వేడుకల కోసం కూడా ఈ నెల 22-26 మధ్య మూసివేశారు. తిరిగి బుధవారం తెరవాల్సిఉండగా.. తాజా ఆదేశాలిచ్చింది.
అయితే రైతులు తమకు కేటాయించిన మార్గంలో కాకుండా ఇతర దారుల్లో వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు ఎర్రకోటను ముట్టడించి ఆధ్మాత్మిక జెండాలను ఎగురవేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై ఆందోళనకారులు దాడి చేశారు.
ఇదీ చదవండి : 'ఈ నెల 30న దేశవ్యాప్తంగా నిరాహార దీక్షలు'