లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశంలో ప్రవేశించారనే నిఘా సమాచారంతో... తమిళనాడు వ్యాప్తంగా పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
లష్కరే తోయిబాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు శ్రీలంక నుంచి సముద్రమార్గం ద్వారా తమిళనాడులో ప్రవేశించారని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ ముష్కరులు తమిళనాడులోని కోయంబత్తూర్ సహా వివిధ నగరాలకు వెళ్లినట్లు చెప్పాయి. అయితే వీరు ఏ దేశానికి చెందినవారో స్పష్టంగా తెలియనప్పటికీ, ఒక ముష్కరుడు మాత్రం పాకిస్థాన్‌కు చెందినవాడని సమాచారం.
భద్రత కట్టుదిట్టం
ఉగ్రముప్పు నేపథ్యంలో విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ప్రార్థనా స్థలాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సముద్రతీర జిల్లాల్లో ఉగ్రదాడుల గురించి హెచ్చరికలు జారీచేశారు. ముఖ్యంగా కోయంబత్తూరులో పోలీసులు మోహరించి, తనిఖీలు చేపట్టారు.
ఇదీ చూడండి: భారత్-పాక్‌లు కోరితే మధ్యవర్తిత్వం చేస్తా: ట్రంప్