ETV Bharat / bharat

తమిళనాడులో మరో 4,549 కరోనా కేసులు - తమిళనాడులో కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్​ అంతకంతకూ విజృంభిస్తోంది. అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో తమిళనాడు, దిల్లీ, గుజరాత్​, ఉత్తరప్రదేశ్​ ఉన్నాయి. కర్ణాటకలోనూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.

india cases
కరోనా పంజా: తమిళనాడులో మరో 4,549 కరోనా కేసులు
author img

By

Published : Jul 16, 2020, 7:41 PM IST

Updated : Jul 16, 2020, 7:52 PM IST

దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రోజూ వేలల్లో కేసులు బయటపడుతున్నాయి.

తమిళనాడులో మరో 4,549 కేసులు

తమిళనాడులో రోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 4,549 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 69 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 2,236కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 56వేల 369 మంది బాధితులు ఉన్నారు.

  • ఉత్తర్​ప్రదేశ్​లోనూ ఎన్నడూ లేని విధంగా 2,083 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 43,444కు చేరింది. మొత్తం వెయ్యి మంది మరణించారు.
  • కర్ణాటకలోనూ కరోనా విలయతాండవం చేస్తోంది. గురువారం మరో 4,169 మంది కొవిడ్​ బారినపడ్డారు. రాష్ట్రంలో ఒక్కరోజే 104 మరణాలు నమోదయ్యాయి.
  • దిల్లీలో 1652 కేసులు, 58 మరణాలు నమోదయ్యాయి.
  • గుజరాత్​లో 919 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 10 మరణాలు నమోదయ్యాయి.
  • కేరళలో కొత్తగా 722 మందికి కరోనా సోకింది. మొత్తం కేసులు 10 వేల మార్కును దాటాయి.
  • ఇప్పటి వరకు 1,27,39,490 నమూనాలను పరీక్షించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. బుధవారం ఒక్కరోజే 3,26,826 టెస్టులు చేసినట్లు పేర్కొన్నాయి.

ఇదీ చూడండి:చిరుజల్లులను ఆస్వాదించిన నల్ల చిరుత

Last Updated : Jul 16, 2020, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.