కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. 'భారత ఆర్థిక వ్యవస్థను మోదీ ఎలా నాశనం చేశారు' అనే అంశంపై రాహుల్ పలు విషయాలు మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం వస్తు సేవల పన్ను (జీఎస్స్టీ)తో పేదలపై దాడి చేసిందన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేశారు.
-
GDP में ऐतिहासिक गिरावट का एक और बड़ा कारण है- मोदी सरकार का गब्बर सिंह टैक्स (GST)।
— Rahul Gandhi (@RahulGandhi) September 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
इससे बहुत कुछ बर्बाद हुआ जैसे-
▪️लाखों छोटे व्यापार
▪️करोड़ों नौकरियाँ और युवाओं का भविष्य
▪️राज्यों की आर्थिक स्थिति।
GST मतलब आर्थिक सर्वनाश।
अधिक जानने के लिए मेरा वीडियो देखें। pic.twitter.com/QdD3HMEqBy
">GDP में ऐतिहासिक गिरावट का एक और बड़ा कारण है- मोदी सरकार का गब्बर सिंह टैक्स (GST)।
— Rahul Gandhi (@RahulGandhi) September 6, 2020
इससे बहुत कुछ बर्बाद हुआ जैसे-
▪️लाखों छोटे व्यापार
▪️करोड़ों नौकरियाँ और युवाओं का भविष्य
▪️राज्यों की आर्थिक स्थिति।
GST मतलब आर्थिक सर्वनाश।
अधिक जानने के लिए मेरा वीडियो देखें। pic.twitter.com/QdD3HMEqByGDP में ऐतिहासिक गिरावट का एक और बड़ा कारण है- मोदी सरकार का गब्बर सिंह टैक्स (GST)।
— Rahul Gandhi (@RahulGandhi) September 6, 2020
इससे बहुत कुछ बर्बाद हुआ जैसे-
▪️लाखों छोटे व्यापार
▪️करोड़ों नौकरियाँ और युवाओं का भविष्य
▪️राज्यों की आर्थिक स्थिति।
GST मतलब आर्थिक सर्वनाश।
अधिक जानने के लिए मेरा वीडियो देखें। pic.twitter.com/QdD3HMEqBy
"దేశ జీడీపీ చారిత్రక కనిష్ఠానికి పడిపోవడానికి అసలు కారణం మోదీ సర్కార్ తీసుకువచ్చిన గబ్బర్ సింగ్ ట్యాక్స్ (జీఎస్టీ). కొన్ని లక్షల చిన్న పరిశ్రమలు, కోట్లాది మంది యువత ఉద్యోగాలు, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను ఇది నాశనం చేసింది. జీఎస్టీ అంటే ఆర్థిక పతనమే."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు కొవిడ్-19, లాక్డౌన్ కారణంగా -23.9కి పడిపోయింది.
"అసంఘటిత రంగంపై జీఎస్టీతో రెండో దాడి చేశారు. జీఎస్టీ నిజానికి యూపీఏ తెచ్చిన ఆలోచన. ఇందులో తక్కువ మొత్తంలో మాత్రమే పన్ను ఉంటుంది. కానీ ఎన్డీఏ తెచ్చిన జీఎస్టీలో నాలుగు రకాల పన్నులు ఉన్నాయి. 28 శాతం వరకు పన్ను విధిస్తున్నారు. ఇది అందరికీ అర్థమయ్యేది కాదు. చాలా క్లిష్టమైనది."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
జీఎస్టీతో కేవలం 15 నుంచి 20 మంది సూటుబూటు వేసుకునే కార్పొరేట్లు లబ్ధి పొందుతున్నారన్నారు రాహుల్. చివరికి జీఎస్టీ ద్వారా సేకరించిన పన్నుల వాటాలను రాష్ట్రాలకు ఇవ్వలేని స్థితికి కేంద్రం చేరిందని విమర్శించారు. రాష్ట్రాలు.. టీచర్లు, ఇతర ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాయని రాహుల్ అన్నారు. జీఎస్టీ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.
- ఇదీ చూడండి: మంచులో రెండున్నర గంటలు ఉండి రికార్డు!