ETV Bharat / bharat

"ధీరత్వాన్ని శంకిస్తున్నారు"

author img

By

Published : Mar 5, 2019, 6:08 PM IST

వాయుసేన మెరుపుదాడులకు ఆధారాలు చూపాలని కాంగ్రెస్​ నేతలు అడగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి రవిశంకర్​ ప్రసాద్​. జవాన్ల ధైర్య సాహసాలను తక్కువ చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

మాట్లాడుతున్న రవిశంకర్​ ప్రసాద్​

మన దేశ భద్రతా దళాల ధీరత్వాన్ని, గౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని కాంగ్రెస్​ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి రవిశంకర్​ ప్రసాద్​. ఉగ్రవాదుల శిబిరాలపై వాయుసేన దాడులకు ఆధారాలు అడగడమే ఇందుకు నిదర్శనమని అన్నారు.

కాంగ్రెస్​ సీనియర్​ నేతలు పి.చిదంబరం, కబిల్​ సిబల్​, దిగ్విజయ్​ సింగ్​ వ్యాఖ్యలపై స్పందించారు రవిశంకర్​. వారు పాకిస్థాన్​ తరఫున మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

" వారు సొంతంగా మాట్లాడడం లేదు. రాహుల్​ గాంధీ, సోనియా గాంధీ ఆశీర్వాదాలతో ఆధారాలు అడుగుతున్నారు." -- రవి శంకర్​ ప్రసాద్​, కేంద్ర మంత్రి

భారత వాయుసేన దాడులపై ఏ దేశం ఆధారాలు అడగలేదని రవిశంకర్ పేర్కొన్నారు​. మన దేశ మీడియాను సైతం కాంగ్రెస్ నమ్మడం లేదని మండిపడ్డారు. మెరుపుదాడులకు ఆధారాలు అడిగి భద్రతా దళాల ధైర్యసాహసాలను, ప్రతిష్ఠను తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పశ్చిమ్​ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలపైనా స్పందించారు రవిశంకర్​. "మీరు అన్ని కష్టాలనూ చూశారు. అయినా ఎందుకిలా చేస్తున్నారు" అని దీదీని ప్రశ్నించారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.