ETV Bharat / bharat

లాలూ ప్రసాద్ ఉన్న ఆస్పత్రిలో కరోనా కలకలం - RIMS HOSPITAL

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​.. చికిత్స తీసుకుంటున్న ఝార్ఖండ్​ రిమ్స్​ ఆసుపత్రిలో కరోనా కలకలం రేగింది. అక్కడ ఓ రోగికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఆ బాధితుడికి చికిత్స అందించిన.. డాక్టర్​ ఉమేష్​ ప్రసాదే లాలూను పర్యవేక్షిస్తున్న కారణంగా అధికారులు అప్రమత్తమయ్యారు. వైద్యులందరినీ క్వారంటైన్​ చేశారు. లాలూకు కూడా కొవిడ్​ పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి.

corona patient found in doctors ward treating Lalu Yadav in Ranchi
లాలూ చికిత్స తీసుకుంటున్న ఆస్పత్రిలో కరోనా కలకలం!
author img

By

Published : Apr 28, 2020, 10:42 AM IST

రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) నేత, బిహార్​ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో ఓ రోగికి కరోనా సోకడం కలకలం రేపింది. కొవిడ్​ పాజిటివ్ వచ్చిన రోగికి చికిత్స చేసిన డాక్టర్ ఉమేష్ ప్రసాదే.. లాలూకు కూడా వైద్య సేవలందిస్తున్నారు.

వివరాల ప్రకారం రిమ్స్​ ఆసుపత్రికి వచ్చిన ఓ రోగికి సోమవారం రాత్రి కరోనా సోకినట్లు తేలింది. వెంటనే అతడిని కరోనా కేంద్రానికి తరలించారు. అప్రమత్తమైన అధికారులు.. ఇప్పటికే లాలూను పర్యవేక్షిస్తున్న డాక్టర్​ ఉమేష్​ బృందంలోని వైద్యులందరినీ క్వారంటైన్​కు పంపించారు. కొవిడ్​ పరీక్షల నిమిత్తం వారి నమూనాలు సేకరించారు. వైద్యబృందంలో ఎవరికైనా కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయితే.. లాలూకు కూడా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది.

జైలు నుంచి ఆస్పత్రికి...

దాణా కుంభకోణం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న లాలూ కొంతకాలంగా అనారోగ్యాంతో బాధపడుతున్నారు. ఝార్ఖండ్​ రాంచీ నగరంలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్​(రిమ్స్​)లోని పేయింగ్ వార్డులో చికిత్స పొందుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.