ETV Bharat / bharat

నేడు రామజన్మ భూమి తీర్థక్షేత్ర ట్రస్టు తొలి భేటీ - ram mandir constrution news

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తొలిసారి నేడు దిల్లీలో సమావేశం కానుంది. రామమందిరం నిర్మాణానికి ముహూర్తం, విరాళాల సేకరణ, భవిష్యత్తు కార్యాచరణ వంటి కీలక అంశాలు అజెండాగా ఈ భేటీ జరగనుంది.

ram-mandir-trust-first-meet-
నేడు రామజన్మ భూమి తీర్థక్షేత్ర ట్రస్టు తొలి భేటీ
author img

By

Published : Feb 19, 2020, 5:05 AM IST

Updated : Mar 1, 2020, 7:22 PM IST

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు.. దిల్లీలో నేడు తొలిసారి సమావేశం కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలను ట్రస్టు సభ్యులు చర్చించనున్నారు. రామ మందిర నిర్మాణం ప్రారంభానికి ముహూర్తం నిర్ణయించడం, మందిర నిర్మాణానికి ప్రజల నుంచి పారదర్శకంగా విరాళాల సేకరణ, భవిష్యత్తు కార్యచరణ వంటి కీలక అంశాలు సమావేశ అజెండాగా ఉన్నాయి.

నేడు రామజన్మ భూమి తీర్థక్షేత్ర ట్రస్టు తొలి భేటీ

వివాదాలు లేకుండా విరాళాలు..

నిర్ణీత సమయంలోగా రామ మందిరాన్ని నిర్మించాలని ట్రస్టు ఆశిస్తోంది. ఇందుకు కాలవ్యవధిని నిర్ణయించనున్నారు. అంతేకాకుండా మందిరాన్ని ప్రజల నుంచి విరాళాలు ఏ విధంగా సేకరించాలన్న దానిపైనా చర్చించనున్నారు. విరాళాలు సేకరించే సమయంలో ఎలాంటి వివాదాలు రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలని ట్రస్ట్​ సభ్యులు దృష్టి సారించనున్నారు.

రాంలల్లా విగ్రహ ప్రతిష్ఠ..

రామ మందిరం శంకుస్థాపనకు ముహూర్తం నిర్ణయించడం సహా నిర్మాణ సమయంలో రాంలల్లా విగ్రహాన్ని ఎక్కడ ఉంచాలనేదానిపైన ట్రస్టు సభ్యులు చర్చించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. నేటి సమావేశంలో మందిరానికి చెందిన అధికారుల (ఆఫీస్​ బేరర్ల) ఎన్నికల కూడా జరగనున్నాయి.

పరాశరన్​ నేతృత్వం...

గత ఏడాది నవంబర్​ 9న రామ మందిరానికి సంబంధించి ఓ ట్రస్ట్​ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ..'శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు'ను ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్​లో ఎస్సీ, ఎస్టీకి చెందిన ఓ వ్యక్తితో సహా మొత్తం 15 మంది సభ్యులను నియమించింది. సీనియర్‌ న్యాయవాది పరాశరన్ ఈ ట్రస్టుకు నేతృత్వం వహిస్తున్నారు.

ఇదీ చూడండి: ట్రంప్​కు సబర్మతీ ఆశ్రమ బహుమతులు!

Last Updated : Mar 1, 2020, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.