ETV Bharat / bharat

'అయోధ్య' కేసుపై జస్టిస్ గొగొయి కీలక వ్యాఖ్యలు - 'అయోధ్య' కేసుపై జస్టిస్ గొగొయి కీలక వ్యాఖ్యలు.

అయోధ్య కేసులో వాదనలకు సంబంధించి కీలక విషయాలు పంచుకున్నారు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి. భారత న్యాయ చరిత్రలో ఇదొక కీలకమైన కేసుగా అభివర్ణించారు. ఈ కేసులో ఇరుపక్షాల న్యాయవాదులు అత్యంత ఉద్రేకంతో వాదనల్లో పాల్గొన్నారని చెప్పారు.

Ram Janmbhoomi-Babri dispute 'most fiercely-contested case in India's history': Ex-CJI Ranjan Gogoi
'అయోధ్య' కేసుపై జస్టిస్ గొగొయి కీలక వ్యాఖ్యలు
author img

By

Published : Aug 29, 2020, 10:17 PM IST

రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం భారత న్యాయ చరిత్రలో అత్యంత తీవ్రంగా పోటీపడిన కేసుల్లో ఒకటని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి పేర్కొన్నారు. ప్రతీఒక్క అంశంలో న్యాయవాదుల మధ్య వాడీవేడీ చర్చలు జరిగాయని తెలిపారు. అత్యంత ఉద్రేకంతో న్యాయవాదులు వాదనల్లో పాల్గొన్నారని చెప్పారు.

'అయోధ్య వాదనలు, తీర్పు' అంశాలపై పుస్తకం రాసిన జర్నలిస్ట్ మాలా దీక్షిత్​కు ఈ మేరకు జస్టిస్ గొగొయి సందేశం ఇచ్చారు. భారీ రికార్డుల ఆధారంగా.. బహుముఖ సమస్యలు ఉన్న కేసులకు పరిష్కారం నిర్ణయిస్తారని పేర్కొన్నారు.

"అయోధ్య కేసుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. భారత న్యాయ చరిత్రలో అత్యంత తీవ్రంగా పోటీ పడిన కేసుల్లో ఇదొకటి. బహుముఖ సమస్యలకు రికార్డులు, లిఖిత, డాక్యుమెంటరీ సాక్ష్యాల ఆధారంగా తుది తీర్మానాన్ని రూపొందించడం జరుగుతుంది. ఇరుపక్షాలకు ప్రాతినిథ్యం వహించిన న్యాయవాదులు ప్రతీ పాయింట్​ను అత్యంత ఉద్రేకంతో వాదించారు."

-జస్టిస్ రంజన్ గొగొయి, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి

అయోధ్య కేసులో తుది తీర్పు ఇవ్వడం సవాల్​తో కూడుకున్న విషయమని జస్టిస్ గొగొయి పేర్కొన్నారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయని వివరించారు. 40 రోజుల నిరంతర వాదనల్లో న్యాయవాదుల సహకారం ఎనలేనిదని కొనియాడారు.

పుస్తకావిష్కరణ

అయోధ్య కేసు విచారణలు, తీర్పు వివరాలతో దీక్షిత్​ రాసిన ''అయోధ్య సే అదాలత్ తక్ భగవాన్ శ్రీరామ్'' అనే పుస్తకాన్ని శుక్రవారం విడుదల చేశారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్​ఆర్ సింగ్, జర్నలిస్ట్​లు బీఆర్ మణి, రామ్ బహదుర్ రాయ్, ఎన్​కే సింగ్​ పాల్గొన్నారు.

వివాదానికి ముగింపు..

జస్టిస్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 40 రోజులపాటు విచారణ జరిపిన తర్వాత 2019 నవంబరు 9న తుది తీర్పు ఇచ్చింది.

వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగిస్తూ రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. సున్నీ వక్ఫ్​ బోర్డుకు అయోధ్యలోనే అయిదెకరాల భూమిని ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రామజన్మభూమిలోని 2.77 ఎకరాల స్థలం రామ్‌లల్లాకే చెందుతుందని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి- రష్యాలో యుద్ధ విన్యాసాలకు భారత్​ దూరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.