రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆరోగ్యం మరింత క్షీణిస్తోందని వైద్యులు వెల్లడించారు. అనారోగ్యం కారణంగా దాస్ ఇటీవలే లఖ్‌నవూలోని మేదాంత ఆసుపత్రిలో చేరారు.
" మహంత్ గోపాల్ దాస్‌కు మంగళవారం డయాలసిస్ చికిత్స అందించాం. ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది. ప్రస్తుతానికి వెంటిలేటర్‌పై ఉంచాల్సిన పరిస్థితి అయితే రాలేదు".
-రాకేష్ కపూర్, ఆసుపత్రి డైరెక్టర్.
ఈ నేపథ్యంలో మహంత్ గోపాల్ దాస్‌ను యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పరామర్శించారు. దాస్ ఆరోగ్య పరిస్థితుల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
శ్వాస కోశ సమస్యలు ఎదుర్కొంటున్న మహంత్ దాస్‌ను తొలుత అయోధ్యలోని శ్రీరాం ఆసుపత్రిలో చేర్పించారు. కానీ, ఆయన ఆరోగ్య పరిస్థితి అంతకంతకూ క్షీణించడం వల్ల లఖ్‌నవూలోని మేదాంత ఆసుపత్రిలో చేర్పించారు.