రాజ్యసభ సచివాలయానికి చెందిన ఓ అధికారికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మే 28న విధులకు హాజరైన డైరెక్టర్ స్థాయి అధికారి సహా ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ అనెక్సె భవనంలోని రెండు అంతస్తులను మూసేశారు అధికారులు.
రాజ్యసభ సచివాలయంలో వైరస్ సోకిన వారిలో ఈ ఉద్యోగి రెండోవారు. మొత్తంగా పార్లమెంట్లో పనిచేసేవారిలో ఇప్పటివరకు నలుగురికి మహమ్మారి సోకింది.