కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ప్రతిపక్ష పార్టీ నేటికీ అధ్యక్షుడి కోసం వెతుకుతూనే ఉందంటూ ఎద్దేవా చేశారు. అసలు కాంగ్రెస్‌కు నాయకుడు ఉంటాడా లేదా అనేది స్పష్టత లేదని విమర్శించారు.
రాజస్థాన్‌లోని జైపుర్‌లో భాజపా జాతీయ స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు రాజ్‌నాథ్. లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయంతో భాజపా-ఎన్డీఏ వైఖరిపై ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొన్నారు.
"నాయకత్వంపై ఆందోళన చెందిన భాజపా వెంటనే జేపీ నడ్డాను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించుకుంది. అనంతరం సంస్థాగత కార్యకలాపాలను ప్రారంభించింది. కానీ కాంగ్రెస్‌లో ఎవరు అధ్యక్షుడు అనేది తెలియకుండా ఉంది. అసలు కాంగ్రెస్‌కు నాయకుడు ఉంటాడా లేదా అనేది స్పష్టంగా తెలియదు. పార్టీ ఇప్పటికీ ఎవరు అధ్యక్షుడు అయితే బాగుంటుందని వెతుకుతూనే ఉంది. కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులున్నాయి. "
- రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు.