భారత సైన్యంపై తనకు విశ్వాసం ఉన్నట్టు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. దేశ భూభాగంలోని ఒక్క అంగుళం కూడా ఇతరులు ఆక్రమించుకునే అవకాశాన్ని భారత సైనికులు ఇవ్వరని ధీమా వ్యక్తం చేశారు. రెండు రోజుల బంగాల్, సిక్కిం పర్యటనలో ఉన్న రాజ్‌నాథ్.. డార్జిలింగ్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.
"భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు త్వరగా తొలిగిపోవాలని భారత్ కోరుకుంటోంది. శాంతి స్థాపన జరగాలని ఆశిస్తోంది. అదే మా లక్ష్యం కూడా. కానీ కొన్నిసార్లు నేరపూరత ఘటనలు జరుగుతున్నాయి. కానీ మన సైనికులపై నాకు నమ్మకం ఉంది. దేశంలోని ఒక్క అంగుళాన్ని కూడా ఆక్రమించుకోకుండా మన జవాన్లు చూసుకుంటారు. ఇందుకు ఇటీవలి పరిస్థితులే నిదర్శనం. మన జవాన్ల శౌర్యం, చరిత్రలో నిలిచిపోతుంది. చరిత్రకారులు.. జవాన్ల ధైర్యాన్ని సువర్ణాక్షరాలతో లిఖిస్తారు."
-- రాజ్‌నాథ్ సింగ్, రక్షణమంత్రి.
ఆయుధ పూజ..
విజయదశమి సందర్భంగా.. డార్జిలింగ్‌లోని సుక్నా యుద్ధ స్మారకం వద్ద ఆయుధ పూజ నిర్వహించారు రాజ్‌నాథ్. సైనిక ఆయుధాలకు పూజలు చేశారు. ఈ వేడుకలో సైన్యాధిపతి జనరల్ నరవాణే పాల్గొన్నారు.
ఆయుధ పూజ అనంతరం టేవర్ అసాల్ట్ రైఫిల్ పని తీరును పరిశీలించారు రాజ్‌నాథ్. దాని సామర్థ్యాన్ని, విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
-
#WATCH West Bengal: Defence Minister Rajnath Singh inspects a Tavor assault rifle at Sukna War Memorial in Darjeeling. https://t.co/CfgqAgplWY pic.twitter.com/8X2uzOipwc
— ANI (@ANI) October 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH West Bengal: Defence Minister Rajnath Singh inspects a Tavor assault rifle at Sukna War Memorial in Darjeeling. https://t.co/CfgqAgplWY pic.twitter.com/8X2uzOipwc
— ANI (@ANI) October 25, 2020#WATCH West Bengal: Defence Minister Rajnath Singh inspects a Tavor assault rifle at Sukna War Memorial in Darjeeling. https://t.co/CfgqAgplWY pic.twitter.com/8X2uzOipwc
— ANI (@ANI) October 25, 2020
ఆ తర్వాత.. సిక్కింలో సరిహద్దు రోడ్డు సంస్థ(బీఆర్ఓ) ఇటీవలే నిర్మించిన ఓ రహదారిని ప్రారంభించారు రాజ్‌నాథ్. సుక్నాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం జరిగింది.
ఇదీ చూడండి:- 'వారితో మంచి సంబంధాలే కోరుకున్నాం.. కానీ'