భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి బెన్నీ గాంట్జ్ తో టెలిఫోన్లో సంభాషించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
-
Had a telephone conversation with the Defence Minister of Israel, Mr. Benny Gantz and reviewed the progress on defence cooperation between both the countries.
— Rajnath Singh (@rajnathsingh) July 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
We also discussed the prevailing COVID-19 situation and how we can fight against this menace through mutual cooperation
">Had a telephone conversation with the Defence Minister of Israel, Mr. Benny Gantz and reviewed the progress on defence cooperation between both the countries.
— Rajnath Singh (@rajnathsingh) July 24, 2020
We also discussed the prevailing COVID-19 situation and how we can fight against this menace through mutual cooperationHad a telephone conversation with the Defence Minister of Israel, Mr. Benny Gantz and reviewed the progress on defence cooperation between both the countries.
— Rajnath Singh (@rajnathsingh) July 24, 2020
We also discussed the prevailing COVID-19 situation and how we can fight against this menace through mutual cooperation
" రక్షణ రంగంలో ఇరుదేశాల పరస్పర సహకారంలో పురోగతిపై ఇజ్రాయెల్ మంత్రితో ఫోన్లో చర్చలు జరిపా. కరోనా పరిస్థితులపైనా మాట్లాడాం. వైరస్ కట్టడికి సంయుక్తంగా ఎలా పోరాడాలనే విషయంపైనా చర్చించాం."
-రాజ్నాథ్ సింగ్ ట్వీట్.
సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో నిఘా సామర్థ్యాన్ని మరింత పటిష్ఠం చేసుకోవాలని భావిస్తోంది భారత్. మోదీ సర్కారు రక్షణ రంగానికి ఇచ్చిన ఆర్థిక అధికారాల కింద ఇజ్రాయెల్ నుంచి హెరాన్ నిఘా డ్రోన్లు, స్పైక్ యాంటీ గైడెడ్ క్షిపణులను అత్యవసరంగా దిగుమతి చేసుకునే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలోనే చర్చలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
గతంలో దిగుమతి చేసుకున్న హెరాన్ మానవరహిత ఏరియల్ వాహనాల సేవలను భారత సైన్యం ఇప్పటికే వినియోగిస్తోంది. లద్దాఖ్ సెక్టార్లో గస్తీ నిర్వహించేందుకు వీటిని విరివిగా ఉపయోగిస్తోంది. మరిన్ని ఆయుధ పరికరాలను ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకోనుంది.