ETV Bharat / bharat

స్వచ్ఛ రేటింగ్​: విజయవాడ, తిరుపతికి 3 స్టార్ - పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్​దీప్​ సింగ్ పూరీ

స్వచ్ఛత, పరిశుభ్రత నెలకొల్పడంలో అత్యున్నత ప్రమాణాలు పాటించే నగరాలకు ఇచ్చే రేటింగ్ వివరాలను వెల్లడించారు​ కేంద్ర మంత్రి హర్​దీప్ సింగ్ పూరీ. ముంబయి, మైసూర్, ఇండోర్​ సహా మొత్తం ఆరు నగరాలను '5 స్టార్ గార్బేజ్ ఫ్రీ' నగరాలుగా ప్రకటించారు. దిల్లీ 3 స్టార్ గార్బేజ్​ ఫ్రీ సిటీల జాబితాలో ఉన్నట్లు స్పష్టం చేశారు.

garbage free rating
గార్బేజ్​ ఫ్రీ రేటింగ్
author img

By

Published : May 19, 2020, 4:31 PM IST

Updated : May 19, 2020, 4:39 PM IST

బహిరంగ ప్రదేశాల్లో చెత్తా చెదారం లేకుండా స్వచ్ఛతను పాటించే నగరాల జాబితాను కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్​దీప్​ సింగ్ పూరీ వెల్లడించారు. మొత్తం ఆరు నగరాలకు '5 స్టార్ గార్బేజ్​ ఫ్రీ' రేటింగ్ ఇచ్చినట్లు తెలిపారు.

5 స్టార్ రేటింగ్ జాబితాలో అంబికాపుర్(ఛత్తీస్​గఢ్), రాజ్​కోట్​, సూరత్, మైసూర్, ఇండోర్​, నవీ ముంబయి నగరాలకు చోటు దక్కినట్లు పూరీ స్పష్టం చేశారు.

కర్నాల్, న్యూదిల్లీ, తిరుపతి, విజయవాడ, ఛండీగఢ్, భిలాయ్ నగర్, అహ్మదాబాద్​ నగరాలు 3 స్టార్ గార్బేజ్​ ఫ్రీ రేటింగ్ పరిధిలోకి వచ్చినట్లు తెలిపారు పూరీ. దిల్లీ కంటోన్మెంట్, వడోదర, రోహ్​తక్​ నగరాలు 'వన్​ స్టార్ గార్బేజ్​ ఫ్రీ' జాబితాలో ఉన్నట్లు తెలిపారు.

మొత్తం 141 నగరాలకు రేటింగ్ ఇచ్చింది కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ. ఆరు నగరాలకు 5 స్టార్, 65 నగరాలకు 3 స్టార్, 70 నగరాలకు ఒక స్టార్ రేటింగ్ ఇచ్చినట్లు తెలిపింది. మొత్తం 1,435 నగరాలు స్టార్ రేటింగ్ మదింపు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆ శాఖ కార్యదర్శి దుర్గ శంకర్ మిశ్రా వెల్లడించారు. రేటింగ్​ కోసం 1.19 కోట్ల మంది ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టినట్లు తెలిపారు. 10 లక్షల జియోట్యాగ్ ఫొటోలను పరిగణనలోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

ర్యాంకింగ్ ఇలా!

స్వచ్ఛత, పరిశుభ్రత పాటించడంలో అత్యున్నత ప్రమాణాలు చూపించిన నగరాల ఆధారంగా ఈ జాబితా రూపొందిస్తారు. స్వచ్ఛ భారత్​ మిషన్​లో భాగంగా నగరాలకు 1 నుంచి 7 స్టార్ల రేటింగ్ ఇస్తారు. చెత్త సేకరణ, తడి-పొడి చెత్త వేరు చేయడం, బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేయడం, డ్రైనేజీ వ్యవస్థ సహా మొత్తం 12 అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ జాబితా తయారు చేస్తారు.

Last Updated : May 19, 2020, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.