రజనీకాంత్ కొత్తగా ఏర్పాటు చేయనున్న రాజకీయ పార్టీ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు సూపర్‌స్టార్ సలహాదారు. వచ్చే ఎన్నికల్లో 234 సీట్లలో బరిలోకి దిగనున్నట్టు సలహాదారు తమిళరువి మణియన్ తెలిపారు. రజనీకాంత్ సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టనున్నారని చెప్పారాయన.
ప్రస్తుతం కొనసాగుతున్న విద్వేష రాజకీయాలు కాకుండా ఆధ్యాత్మిక రాజకీయాలు చేయనున్నట్లు మణియన్ అన్నారు. లౌకిక, ఆధ్యాత్మిక రాజకీయాలు కలిసి పనిచేయటం అసాధ్యమన్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు.
ఇదీ చదవండి: రజనీతో పొత్తుకు సిద్ధం: పన్నీర్ సెల్వం