జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370 రద్దుకు కృషిచేసిన కేంద్రహోంమంత్రి అమిత్‌షాపై సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రధాని నరేంద్రమోదీ-అమిత్‌షా ద్వయాన్ని కృష్ణార్జునులు అని ఆయన అభివర్ణించారు.
"మిషన్ కశ్మీర్ చేపట్టిన అమిత్‌షాకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. శెభాష్. మోదీ-షాలు కృష్ణార్జునులు. అయితే వీరిలో ఎవరు కృష్ణుడో, ఎవరు అర్జునుడో మనకు తెలియదు." -రజనీకాంత్, సినీనటుడు
వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేసిన క్రానికల్ పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొన్న రజనీకాంత్... అమిత్‌షాపై ప్రశంసలు కురిపించారు.
రాజకీయాల్లోకి వస్తున్నా...
తమిళనాట విశేష ప్రేక్షకాదరణ ఉన్న నటుడు రజనీకాంత్. ఆయన రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు.
కశ్మీర్ విభజన
మోదీ ప్రభుత్వం కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇస్తున్న ఆర్టికల్ 370, ఆర్టికల్ 35-ఎ లను రద్దు చేసింది. అలాగే ఆ రాష్ట్రాన్ని జమ్ము కశ్మీర్, లద్ధాఖ్... కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.
ఇదీ చూడండి: 15 కిలోమీటర్ల జాతీయ జెండాతో మానవహారం