ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై చేసిన వ్యాఖ్యలను సూపర్‌స్టార్ రజనీకాంత్ సమర్థించుకున్నారు. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడంలో మోదీ ప్రభుత్వం తనదైన శైలిలో దౌత్యపరమైన విధానాన్ని అనుసరించిందని రజనీ అభిప్రాయపడ్డారు.
ఇటీవలే మోదీ, షా ద్వయాన్ని కృష్ణార్జునులుగా అభివర్ణించారు సూపర్‌స్టార్. ఒకరు పథకాన్ని రచిస్తే మరొకరు అమలు చేస్తారని కొనియాడారు రజనీ. కశ్మీర్ అంశంపై వారిద్దరి వైఖరి అద్భుతంగా ఉందని ప్రశంసించారు.
కశ్మీర్ అంశం జాతీయ భద్రతకు సంబంధించిన అంశమన్నారు సూపర్‌స్టార్. ఏ విషయాన్ని రాజకీయం చేయాలో.. వేటిని రాజకీయం చేయకూడదో నేతలు అర్థం చేసుకోవాలని హితవు పలికారు.