ETV Bharat / bharat

అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని మళ్లీ కేబినెట్​ భేటీ - Rajasthan political slugfest

రాజస్థాన్​లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. సొంతపార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో తమ బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమైన అధికార కాంగ్రెస్..​ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు శతవిధాల కృషి చేస్తోంది. మరోమారు మంత్రివర్గ సమావేశం నిర్వహించి గవర్నర్​కు ప్రతిపాదనలు పంపనుంది.

Rajasthan govt
అసెంబ్లీ సమావేశాల కోసం మరోమారు కేబినేట్​ భేటీ
author img

By

Published : Jul 25, 2020, 11:46 AM IST

Updated : Jul 25, 2020, 12:51 PM IST

రాజస్థాన్​లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరదించాలని ప్రయత్నిస్తోంది అధికార కాంగ్రెస్ ప్రభుత్వం​. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బలం నిరూపించుకోవాలని చూస్తోంది. శాసనసభ సమావేశాల నిర్వహణపై ఇప్పటికే గవర్నర్​ కల్​రాజ్​ మిశ్రాను కలిసిన ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​, ఆయన మంత్రి వర్గం.. మరోమారు ఈ రోజు భేటీ కానుంది. సమావేశాలు త్వరితగతిన నిర్వహించాలని మళ్లీ ప్రతిపాదించనున్నారు .

శుక్రవారం రాత్రి భేటీ అయిన గహ్లోత్​ మంత్రివర్గం.. సుమారు రెండు గంటల పాటు గవర్నర్​ లేవనెత్తిన ప్రశ్నలపై చర్చించింది. శనివారం మరోమారు మంత్రివర్గం భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కేబినెట్​ భేటీలో ఆమోదం తర్వాత కొత్త ప్రతిపాదనలను గవర్నర్​కు పంపనున్నట్లు స్పష్టం చేశారు.

సీఎల్పీ భేటీ...

రాజస్థాన్​లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు ఇవాళ కాంగ్రెస్​ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. 11.30 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నట్లు చీఫ్​ విప్​ మహేష్​ జోషి తెలిపారు. ఎమ్మెల్యేలు ఉన్న హోటల్​లోనే ఈ భేటీ ఉండనుందని వెల్లడించారు.

ఇదీ చూడండి: గవర్నర్​ ప్రశ్నలపై రాజస్థాన్​ కేబినెట్​ సుదీర్ఘ చర్చ

Last Updated : Jul 25, 2020, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.