దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న వేళ.. రాజస్థాన్ ప్రభుత్వం ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్‌ను రెండు శాతం మేర తగ్గిస్తున్నట్లు ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రకటించారు.
'ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను రెండు శాతం తగ్గించింది. సామాన్య ప్రజానీకంపై భారం తగ్గించేందుకు కేంద్రం కూడా ఈ దిశగా యోచన చేస్తుందని ఆశిస్తున్నాం' అని గహ్లోత్ ట్విట్టర్ ద్వారా కేంద్రాన్ని అభ్యర్థించారు.
గత మూడు రోజులుగా ఆ రాష్ట్ర రాజధాని నగరం జైపుర్‌లో పెట్రోల్‌ను రూ.93.94కి విక్రయిస్తున్నారు. డీజిల్ దర రూ.86.02గా ఉంది. విలువ ఆధారిత పన్ను( వ్యాట్) అనేది పరోక్ష పన్ను. ఇది ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా అమల్లో ఉంటుంది.
ఇదీ చదవండి:పెట్రో మంటలకు ప్రభుత్వాల ఆజ్యం