రాజస్థాన్లో కరోనా నిబంధనలను కఠినతరం చేశారు. నిబంధనల ఉల్లంఘనలపై జరిమానాను భారీగా పెంచారు. వివాహ వేడుకల్లో 100 మందికి పైగా హాజరైతే ప్రస్తుతం పది వేలుగా ఉన్న జరిమానాను రూ.25 వేలకు పెంచుతున్నట్లు సీఎం అశోక్ గహ్లోత్ ప్రకటించారు.
మాస్కు ధరించకపోతే రూ.500 (ఇంతకుముందు రూ.200)కు పెంచారు.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అదుపులోకి తెచ్చేందుకు రాత్రి కర్ఫ్యూను పునరుద్ధరించారు గహ్లోత్. ప్రజలందరూ నిబంధనలు పాటించేలా అధికారులు, పోలీసులు నిత్యం పర్యవేక్షణ చేపట్టాలని గహ్లోత్ ఆదేశించారు.
ఇదీ చూడండి: టీకా అత్యవసర అనుమతులపై కేంద్రం దృష్టి