ETV Bharat / bharat

పండుగ సీజన్​లో మరో 392 ప్రత్యేక రైళ్లు - రైల్వే శాఖ వార్తలు

దసరా, దీపావళి వంటి పండుగలు వస్తున్న నేపథ్యంలో మరిన్ని ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు సిద్ధమైంది భారతీయ రైల్వే. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు అదనంగా మరో 196 రూట్లలో 392 ట్రైన్లను నడపబోతున్నట్లు ప్రకటించింది.

Railways
ప్రత్యేక రైళ్లు
author img

By

Published : Oct 20, 2020, 5:03 AM IST

Updated : Oct 20, 2020, 6:20 AM IST

పండుగ సీజన్​ ప్రారంభం కానున్న నేపథ్యంలో మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు భారతీయ రైల్వే సిద్ధమైంది. అక్టోబర్ 20 (నేటి) నుంచి నవంబర్ 30 మధ్య మొత్తం 196 రూట్లలో 392 రైలు సర్వీసులను నడపనుంది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు ఇవి అదనం.

దసరా నవరాత్రులతో పాటు దీపావళి, ఉత్తరాదిన ప్రత్యేకంగా జరిగే ఛఠ్ పూజ లాంటి పండుగలు వరుసగా ఉన్న కారణంగా ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంతో ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు భారతీయ రైల్వే తెలిపింది. అయితే, ఈ రైళ్ల టికెట్ ధరలు.. తరగతులను అనుసరించి 10 నుంచి 30 శాతం పెంచనుంది.

భద్రతపై సమీక్ష..

కరోనా నేపథ్యంలో స్టేషన్లు, రైళ్లలో తీసుకోవాల్సిన చర్యలు, భద్రత వంటి అంశాలపై రైల్వే బోర్డు ఛైర్మన్ గతవారంలో సమీక్ష నిర్వహించారు.

సికింద్రాబాద్, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, చెన్నై, మధురై, తిరువనంతపురం, కన్యాకుమారి, కోల్‌కతా, పట్నా, వారణాసి, లఖ్​నవూ, గయ, జైపుర్, పూరీ, భువనేశ్వర్ సహా పలు స్టేషన్ల నుంచి ఈ స్పెషల్ ట్రైన్లు నడుస్తాయని రైల్వే శాఖ వెల్లడించింది.

అంతరాయం లేకుండా..

బోనస్​ చెల్లింపుల్లో జాప్యానికి నిరసనగా ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని రైల్వే ఉద్యోగులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని రైల్వే బోర్డు తమ అధికారులను ఆదేశించింది.

రైళ్లు సజావుగా నడిచేందుకు అవసరమైన కఠిన చర్యలు చేపట్టాలని, ఎలాంటి అలసత్వానికి తావు ఇవ్వొద్దని జనరల్ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసింది. రైలును మధ్యలో వదిలిపెట్టడం, రైళ్ల రాకపోల్ని అడ్డుకోవటం, ఉత్తర్వులను ధిక్కరించి వ్యక్తుల భద్రతను ప్రమాదంలో నెట్టడం వంటివి చేస్తే రైల్వే చట్టం కింద చర్యలు తీసుకోవాలని తెలిపింది.

లాక్​డౌన్ కారణంగా..

కరోనా లాక్​డౌన్ నేపథ్యంలో మార్చి చివరివారంలో రైలు సేవలను నిలిపేశారు. అన్​లాక్​ ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి క్రమంగా రైలు సేవలను పునరుద్ధరిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 682 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి.

ఇదీ చూడండి: యూపీ, పంజాబ్​లో తెరుచుకున్న పాఠశాలలు

Last Updated : Oct 20, 2020, 6:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.