వలస పాలన నాటి ఖలాసి విధానానికి రైల్వే మంత్రిత్వ శాఖ స్వస్తి పలికాలని భావిస్తోంది. ఈ విధానంలో కొత్త నియామకాలను నిలుపుదల చేస్తూ ఆగస్టు 6న ఆదేశాలు జారీ చేసింది రైల్వే బోర్డు.
"టెలిఫోన్ అటెండెంట్-కమ్- డాక్ ఖలాసీస్ (టీఏడీకే) ఉద్యోగాలపై సమీక్ష జరుగుతోంది. అందువల్ల ఈ విధానంలో కొత్త నియామకాలను నిలుపుదల చేస్తున్నాం. ఇది తక్షణం అమల్లోకి వస్తుంది."
- రైల్వే బోర్డు
2020 జులై 1 నుంచి జరిగిన ఇటువంటి నియామకాలను అన్నింటినీ సమీక్షించి సలహా ఇవ్వవచ్చని బోర్డు పేర్కొంది. ఇది అన్ని రైల్వే సంస్థలలో కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.
ఖలాసి అంటే..
సీనియర్ అధికారుల నివాసాల్లో పనిచేసే వ్యక్తులను 'ఖలాసి' లేదా 'బంగ్లా ప్యూన్' అంటారు. ఈ విధానం బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉంది.
ఇదీ చూడండి: నేడు తొలి కిసాన్ రైలు పరుగులు