ETV Bharat / bharat

వినాయక చవితికి ప్రత్యేక రైళ్లు!

మహారాష్ట్ర కొంకణ్​ ప్రాంతంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడపాలని మధ్య రైల్వే భావిస్తోంది. ఈ మేరకు సాధ్యాసాధ్యాలకు సంబంధించి వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

MH-FESTIVAL-TRAINS
ప్రత్యేక రైళ్లు
author img

By

Published : Aug 8, 2020, 2:03 PM IST

వినాయక చవితి వేడుకల నేపథ్యంలో కొంకణ్ ప్రాంతానికి ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ప్రకటించే అవకాశం ఉంది. ఈ విషయమై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు రైల్వే అధికారి ఒకరు చెప్పారు.

"రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య రైల్వే లేఖ రాసింది. కొంకణ్​ ప్రాంతంలో ప్రత్యేక రైళ్లను నడిపే విషయంలో అభిప్రాయాలను కోరింది. మధ్య, పశ్చిమ, కొంకణ్​ రైల్వే సహకారంతో ఈ రైళ్లను నడిపే అవకాశం ఉంది."

- రైల్వే అధికారి

ఆగస్టు 22న ప్రారంభమయ్యే గణేశ్ చతుర్థి వేడుకలు 10 రోజులపాటు జరగనున్నాయి. అన్ని రోజులు ప్రత్యేక రైళ్లను నడిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైళ్ల సంఖ్య, ఫ్రీక్వెన్సీని మాత్రం డిమాండ్​ను బట్టి నిర్ణయిస్తారని సదరు అధికారి వెల్లడించారు.

రైళ్లను నడపాల్సి వస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన కొవిడ్​- 19 మార్గదర్శకాలను పాటించాలని మహారాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్​ అభయ్​ యావల్కర్ స్పష్టం చేశారు. రైళ్లు, స్టేషన్లలో భౌతిక దూరం, మాస్కులను తప్పనిసరి చేయాలని చెప్పారు.

ఇదీ చూడండి: కేరళ విమాన ప్రమాద దృశ్యాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.