ETV Bharat / bharat

10 రోజుల్లో మరో 2,600 రైళ్లు- 36 లక్షల మంది టార్గెట్ - indian Railways news

లాక్​డౌన్​ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 75 లక్షల మంది వలసకూలీలను రైళ్లు, బస్సుల ద్వారా సొంతూళ్లకు తరలించినట్లు తెలిపింది కేంద్రం. దేశవ్యాప్తంగా మొత్తం వలస కార్మికుల సంఖ్య 4 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. రానున్న పది రోజుల్లో మరో 2,600 శ్రామిక్​ రైళ్లు నడపనున్నట్లు స్పష్టం చేసింది.

indian Railways news
పట్టాలెక్కనున్న 2,600 రైళ్లు.. మరో 10 రోజుల్లోనే
author img

By

Published : May 23, 2020, 7:35 PM IST

శ్రామిక్‌ రైళ్లు, బస్సులు ద్వారా ఇప్పటివరకు 75 లక్షల మంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించామని వెల్లడించింది కేంద్రం. మొత్తం 4 కోట్ల మంది వలస కార్మికుల్లో.. మరో 36 లక్షల మందిని తరలించేందుకు త్వరలో మరిన్ని రైళ్లను నడపనున్నట్లు తెలిపింది.

మార్చి 24న లాక్​డౌన్​ ప్రకటించిన తర్వాత నుంచి శ్రామిక్​ రైళ్ల ద్వారా దాదాపు 35 లక్షల మంది.. బస్సుల ద్వారా 40 లక్షల మంది స్వస్థలాలకు చేర్చినట్లు వివరించింది కేంద్రం.

త్వరలో 2,600 శ్రామిక్‌ రైళ్లు...

వలసకూలీలను తరలించేందుకు రానున్న 10 రోజుల్లో 2,600 శ్రామిక్‌ రైళ్లు నడపనున్నట్లు వెల్లడించింది రైల్వేశాఖ. ఈ సర్వీసుల ద్వారా మరో 36 లక్షల మంది కార్మికులను వారి స్వస్థలాలకు తరలించనున్నట్లు స్పష్టం చేసింది. గత 23 రోజుల్లో 2,600 శ్రామిక్‌ రైళ్లు నడపినట్లు తెలిపింది. గత నాలుగు రోజులుగా సగటున 260 రైళ్లు నడిపామని.. మొత్తం 3 లక్షల మంది ఈ నాలుగు రోజుల్లోనే ప్రయాణించినట్లు వెల్లడించారు రైల్వే అధికారులు.

సాధారణ ఛార్జీలే...

జూన్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా 200 రైళ్లు నడపాలని నిర్ణయించింది కేంద్రం. ఇప్పటికే వీటికి సంబంధించిన బుకింగ్​లు ప్రారంభమయ్యాయి. అయితే వాటికి గతంలోలా సాధరణ ఛార్జీలే ఉండనున్నట్లు స్పష్టం చేశారు రైల్వే బోర్డు ఛైర్మన్‌ వీకే యాదవ్‌.

"జూన్‌ 1 నుంచి ప్రారంభం కాబోయే ప్రత్యేక రైళ్లలో లాక్‌డౌన్‌కు ముందున్న సాధారణ ఛార్జీలే వసూలు చేస్తున్నాం. టికెట్‌ ధరల్లో ఎలాంటి మార్పులూ లేవు. సీనియర్‌ సిటిజన్లకు ఎలాంటి రాయితీలు వర్తించవు. అనవసర ప్రయాణాలను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. జూన్‌ 1 నుంచి 200 రైళ్లు నడవనున్నాయి. వాటిలో వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్‌ ఉన్న వారికి రైళ్లో ప్రయాణించేందుకు అనుమతి ఉండదు. ఆర్‌ఏసీ ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తున్నాం"

-- వీకే యాదవ్‌, రైల్వే బోర్డు ఛైర్మన్​

దేశవ్యాప్తంగా ఉన్న 17 రైల్వే ఆసుపత్రులను కొవిడ్‌-19 కేర్‌ ఆస్పత్రులుగా మార్చామని చెప్పారు వీకే యాదవ్. ఏప్రిల్‌ 1 నుంచి మే 22 వరకు మొత్తం 9.7 మిలియన్‌ టన్నుల ఆహార ధాన్యాలను రవాణా చేసినట్లు వివరించారు.

11 వేల కోట్లు విడుదల..

ఇప్పటికే ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉండిపోయిన వలసకూలీల కోసం సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి ఆహారం, వసతి కల్పిస్తున్నట్లు తెలిపింది కేంద్రం. ఇందుకుగానూ ఏప్రిల్​ 3 నాటికి రూ.11,092 కోట్లు విడుదల చేసింది. కూలీల సమస్యలను తెలుసుకునేందుకు 24 గంటలు పనిచేసే హెల్ప్​లైన్​నూ ఏర్పాటు చేసింది. శ్రామిక్‌ రైళ్ల టికెట్ల ఖర్చులో 85 శాతాన్ని కేంద్రం, 15 శాతం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి.

మార్చి 24 న దేశవ్యాప్తంగా తొలి విడత లాక్​డౌన్​ ప్రకటించిన మోదీ.. ఆ తర్వాత మే 2, మే17, మే31 వరకు మూడుసార్లు లాక్​డౌన్​ను పొడిగించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.