కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ.. పంజాబ్‌లో ఆందోళనలు ఉద్ధృతం చేస్తున్నారు రైతులు. రైల్వే ట్రాక్‌పై నిరసనలకు దిగారు. సెప్టెంబర్ 24-26 మధ్య 3 రోజుల పాటు రైల్‌రోకో చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.
!['Rail roko' agitation starts in Punjab, train services suspended](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8922168_3.jpg)
కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ.. రైల్‌రోకోకు పిలుపునివ్వగా పలు రైతు సంఘాలు మద్దతిచ్చాయి.
!['Rail roko' agitation starts in Punjab, train services suspended](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8922168_2.jpg)
నిరసనల్లో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించాలని నిర్ణయించాయి.
!['Rail roko' agitation starts in Punjab, train services suspended](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8922168_4.jpg)
రైల్వే ఆస్తులకు నష్టం..!
ఈ నేపథ్యంలో ఫిరోజ్‌పుర్ రైల్వే డివిజన్లో ప్రత్యేక రైలు సర్వీసులను నిలిపివేశారు అధికారులు. ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రైల్‌రోకో కారణంగా అత్యవసర సరుకులు, ఆహార పదార్థాల రవాణాకు తీవ్ర ఆటంకం కలుగుతున్నట్లు చెప్పారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో...
కర్ణాటకలోనూ వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ.. 'ఛలో విధాన సౌధ' కార్యక్రమాన్ని చేపట్టింది సీఐటీయూ. బెంగళూరులోని ఫ్రీడం పార్క్‌లో ధర్నా నిర్వహించింది. ఈ నిరసనలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
!['Rail roko' agitation starts in Punjab, train services suspended](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8922168_54.jpg)
!['Rail roko' agitation starts in Punjab, train services suspended](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8922168_43.jpg)