కరోనా వైరస్ సోకిన కుమారుడ్ని దాచిపెట్టిన ఓ మహిళా అధికారిని సస్పెండ్ చేసింది రైల్వే శాఖ. కుటుంబంలో ఒకరికి కరోనా సోకిందని ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా, ఇతరుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో నెట్టినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు నైరుతి రైల్వే విభాగం అధికారులు.
ఇదీ జరిగింది..
జర్మనీ నుంచి స్పెయిన్ మీదుగా భారత్కు వచ్చాడు 25 ఏళ్ల యువకుడు. ఈనెల 13న బెంగళూరు విమానాశ్రయంలో దిగిన వెంటనే అతడ్ని స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని సూచించారు అధికారులు. రక్త నమూనాలు పరీక్షించి... అతడికి కరోనా సోకిందని ఈనెల 18న నిర్ధరించారు.
ఆ యువకుడి తల్లి రైల్వే ఉద్యోగి. కుమారుడు విదేశాల నుంచి వచ్చాడని, కరోనా సోకిందని ఆమె ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదు. బెంగళూరు ప్రధాన రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే గెస్ట్ హౌస్లో అతడ్ని దాచిపెట్టారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఆమెపై వేటు వేశారు.
ఇదీ చదవండి: కరోనా నుంచి కోలుకుని... గుండెపోటుతో మృతి