సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం నిరాశలో కూరుకుపోయిన కాంగ్రెస్ కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. భారీ మెజార్టీతో తనను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు కేరళ వయనాడ్లో రాహుల్ ర్యాలీ నిర్వహించారు.
పేదల తరఫున గళం వినిపించేందుకు బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ అవతరిస్తుందని రాహుల్ ఆశాభావం వ్యక్తం చేశారు. భాజపా పంచిన విద్వేషాన్ని ప్రేమతోనే జయిస్తామని పునరుద్ఘాటించారు.
"మోదీ దగ్గర చాలా డబ్బు ఉండొచ్చు. ఆయన చెంత మీడియా ఉండొచ్చు. ఆయనకు ధనవంతులైన స్నేహితులు ఉండొచ్చు. అయినప్పటికీ భాజపా పంచిన విద్వేషాన్ని, అసహనాన్ని జయించడానికి కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుంది. వారి ద్వేషానికి ప్రేమతోనే సమాధానమిస్తాం."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
ఇదీ చూడండి : 5 రోజులైనా దొరకని 'ఏఎన్-32' ఆచూకీ