ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలను తీవ్రం చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. చౌకీదార్‌గా ఉంటానని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని మోదీ విస్మరించారని ఆరోపించారు. అంబానీ వంటి ధనికులను మాత్రమే రక్షిస్తున్న ఆయనను పదవి నుంచి తప్పించాలని ప్రజలంతా స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని రాహుల్ అభిప్రాయపడ్డారు. మరోసారి మోదీని ప్రధానిని చేయడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు.
బిహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధానిపై విమర్శలు గుప్పించారు రాహుల్. రఫేల్ ఒప్పందంపై సమగ్ర విచారణ జరిపితే ప్రధాని సహా ఆయన సన్నిహితులందరూ జైలుకు వెళ్లక తప్పదని జోస్యం చెప్పారు. మోదీ ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తే కాంగ్రెస్ 'న్యాయ్' పథకం ద్వారా న్యాయం చేస్తుందన్నారు. 5 కోట్ల మంది పేద కుటుంబాలకు ఏటా రూ.72వేల ఆర్థిక సాయం కచ్చితంగా అందిస్తామని రాహుల్ పునరుద్ఘాటించారు.
ఇదీ చూడండి: మోదీ వెబ్ సిరీస్‌పైనా ఈసీ నిషేధం