ETV Bharat / bharat

'రాహుల్​ రాజీనామా'పై కాంగ్రెస్​ తర్జనభర్జన

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో భవిష్యత్​ కార్యాచరణపై కాంగ్రెస్​ తర్జనభర్జన పడుతోంది. అధ్యక్ష పదవిని వీడేందుకు సిద్ధమైన రాహుల్​ గాంధీని సముదాయించేందుకు నేతాగణం విశ్వప్రయత్నాలు చేస్తోంది.

author img

By

Published : May 28, 2019, 12:22 PM IST

Updated : May 28, 2019, 2:30 PM IST

రాహుల్​ ఇంటికి నేతలు.. రాజీనామాపై బుజ్జగింపులు

లోక్​సభ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని వీడి తీరాలని దృఢ నిశ్చయంతో రాహుల్ గాంధీ. అయితే ఆ ఆలోచన విరమించుకునేలా రాహుల్​ను ఒప్పించేందుకు సీనియర్ నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్ నేతలు రణ్​దీప్ సుర్జేవాలా, సచిన్ పైలట్, అశోక్​ గహ్లోత్ ఈ ఉదయం రాహుల్​తో సమావేశమయ్యారు. అధ్యక్ష బాధ్యతలు వీడొద్దని మరోసారి కోరారు.

ఈ నెల 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ 52 సీట్లు మాత్రమే గెలిచి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఓటమిని సమీక్షించుకునేందుకు 25న కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించిన అనంతరం అధ్యక్ష పదవిని వీడతానని ప్రతిపాదించారు రాహుల్. హతాశులయిన పార్టీనేతలు రాహుల్ నిర్ణయాన్ని తిరస్కరించారు.

పలు రాష్ట్రాల్లో ఖాతా తెరవకపోవడం, కొన్ని రాష్ట్రాల్లో ఒకటి, రెండు సీట్లు మాత్రమే సాధించడం రాహుల్​ను తీవ్రంగా బాధించిందని సమాచారం.

రాజస్థాన్​పై సమాలోచనలు

క్లీన్​స్వీప్​ రాష్ట్రాల్లో రాజస్థాన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, ఆ రాష్ట్ర సీనియర్​ నేత సచిన్ పైలట్​ సోమవారం రాహుల్​ను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ అన్ని అపాయింట్​మెంట్లను రాహుల్ రద్దు చేశారు.

లోక్​సభ ఎన్నికల ఓటమి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు రాజస్థాన్ మంత్రులు, ఎమ్మెల్యేలు రాహుల్​ను కోరారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యనేతలు కాంగ్రెస్ అధ్యక్షుడితో నేడు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజస్థాన్​కు సంబంధించి మార్పులేమైనా ఉండవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇదీ చూడండి: అప్పుడు నెహ్రూ, రాజీవ్​... ఇప్పుడు మోదీ: రజనీ

Intro:Body:Conclusion:
Last Updated : May 28, 2019, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.