ETV Bharat / bharat

వయనాడ్​ వరద బాధితులకు రాహుల్​ భరోసా - కేరళ

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళలోని వయనాడ్​ ప్రజలను ఆదుకోవాలని ప్రధానిని కోరారు కాంగ్రెస్​ నేత రాహుల్​గాంధీ. గతకొద్ది రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన తన సొంత నియోజక వర్గంలో రెండో రోజు పర్యటించారు రాహుల్.

వయనాడ్​ వరద బాధితులకు ధైర్యం చెప్పిన రాహుల్​
author img

By

Published : Aug 13, 2019, 6:11 AM IST

Updated : Sep 26, 2019, 8:07 PM IST

వయనాడ్​ వరద బాధితులకు రాహుల్​ భరోసా

కేరళలో వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తన సొంత నియోజకవర్గం వయనాడ్ ప్రజలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. ప్రస్తుతం వయనాడ్​లో వరద బాధితులను పరామర్శిస్తున్న రాహుల్.. భారీ వర్షాల కారణంగా వేలాది మంది వయనాడ్​ ప్రజలు నిరాశ్రయులయ్యారని, ఇప్పటికీ సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారని తెలిపారు. వయనాడ్​లో పరిస్థితి మామూలు స్థితికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రధాని నరేంద్ర మోదీలను కోరానన్నారు. వరద బీభత్సం కారణంగా నష్టపోయిన వారిని కేంద్రం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కొండచరియలు విరిగిపడి విధ్వంసం సృష్టించిన పుతుమలా ప్రాంతాన్ని సందర్శించారు రాహుల్. శిథిలాల కింద చాలా మంది చిక్కుకొని ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. వయనాడ్, కోజికోడ్​ జిల్లాల్లోని సహాయక శిబిరాల్లో ఉన్న వారితోనూ రాహుల్ మాట్లాడారు. ఎవరూ భయపడొద్దని అందరికీ తగిన సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

83కుచేరిన మృతులు

కేరళలో వరద బీభత్సానికి మృతుల సంఖ్య 83కు చేరింది. మలప్పురం, వయనాడ్‌ జిల్లాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మరో 50 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సుమారు 2 లక్షల 55వేల మంది బాధితులు పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. వర్షాలు సోమవారం తగ్గు ముఖం పట్టాయి. ఫలితంగా మలప్పురం, వయనాడ్‌ జిల్లాల్లో సహాయ చర్యలు ఊపందుకున్నాయి.

AP Video Delivery Log - 2100 GMT News
Monday, 12 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2049: Portugal Truckers Strike 3 AP Clients Only 4224801
Portugal government cracks down on truckers strike
AP-APTN-2040: US IL Blagojevich Protest AP Clients Only 4224800
Supporters urge Trump to set Blagojevich free
AP-APTN-2028: US LA Barr Speech Reaction AP Clients Only 4224799
Reax to US attorney general's talk on gun violence
AP-APTN-2023: Argentina Macri 2 AP Clients Only 4224798
Macri on plummeting currency, elections
AP-APTN-1952: US OH Shooting Presser Part must credit 'Dayton 24/7 Now'/Part no access Dayton/Part must credit 'Montgomery County Sheriff'/No access US broadcast networks/No re-use, no re-sale or archive 4224797
Officials: Ohio shooter's friend bought him armor
AP-APTN-1932: Italy Politics AP Clients Only 4224794
Italy Senate to decide date of no confidence vote
AP-APTN-1924: Spain Wildfires AP Clients Only 4224795
Firefighters tackle wildfire in Gran Canaria
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 26, 2019, 8:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.