ETV Bharat / bharat

ఓటమి తర్వాత తొలిసారి అమేఠీకి రాహుల్ - కాంగ్రెస్

కాంగ్రెస్ నేత రాహుల్ ​గాంధీ... ఇవాళ ఉత్తర్​ప్రదేశ్​లోని అమేఠీలో పర్యటించనున్నారు. సార్వత్రిక ఎన్నికల తరువాత అమేఠీ నియోజకవర్గంలో రాహుల్ పర్యటించనుండటం ఇదే మొదటిసారి. కాంగ్రెస్ కంచుకోట అయిన అమేఠీలో పార్టీ ఓటమికి కారణాలు తెలుసుకోవడానికే ఆయన ఈ పర్యటన చేపట్టారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఓటమి తర్వాత తొలిసారి అమేఠీకి రాహుల్
author img

By

Published : Jul 10, 2019, 6:30 AM IST

Updated : Jul 10, 2019, 7:27 AM IST

కాంగ్రెస్ నేత రాహుల్​గాంధీ నేడు ఉత్తరప్రదేశ్​లోని అమేఠీలో పర్యటించనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాజపా నేత స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన తరువాత... ఆ నియోజకవర్గంలో రాహుల్ పర్యటించడం ఇదే తొలిసారి.

కాంగ్రెస్ కంచుకోట అయిన అమేఠీలో... తాను ఓడిపోవడానికి గల కారణాలు తెలుసుకోవడానికే రాహుల్ ఈ పర్యటన చేపట్టినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ పర్యటనలో ఆయన పార్టీ ప్రతినిధులతో భేటీ అవుతారు. అలాగే సలోన్​, అమేఠీ, గౌరీగంజ్, జగ్దీశ్​పూర్, తలోయ్​ అసెంబ్లీ విభాగాల అధ్యక్షులతోనూ సమావేశమవుతారు. పనిలో పనిగా రాహుల్​ గాంధీ కొన్ని గ్రామాలనూ సందర్శిస్తారని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ సింగ్​ తెలిపారు.

అలాగే పార్టీ కార్యకర్తలతో రాహుల్​గాంధీ.... గౌరీగంజ్​లోని నిర్మలాదేవి ఎడ్యుకేషనల్​ ఇన్​స్టిట్యూట్​లో సమావేశం కానున్నారు.

ఇదీ విషయం..

సార్వత్రిక ఎన్నికల్లో అమేఠీ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాహుల్​ గాంధీ భాజపా అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో 52 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ అధికార ప్రతినిధి చంద్రకాంత్ దూబే, జిల్లా అధ్యక్షుడు యోగేంద్ర మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అమేఠీలో మరలా పార్టీని బలోపేతం చేయడంపై రాహుల్ దృష్టి సారించారు.

రాహుల్​గాంధీ అమేఠీ లోక్​సభ స్థానం నుంచి 1999 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కేరళలోని వయనాడ్ నుంచి పార్లమెంట్​ సభ్యుడిగా ఉన్నారు.

ఇదీ చూడండి: 'రుణమాఫీ తర్వాతే రైతు ఆత్మహత్యలు పెరిగాయి'

Manchester (UK), Jul 09 (ANI): Rain once again played the spoil sport at Old Trafford in Manchester during end of New Zealand innings today. Fans were disappointed as they feel India looks way ahead in the match. New Zealand were 211/5 in 46.1 overs before rain interrupted the play. India's earlier clash with New Zealand was also washed out.
Last Updated : Jul 10, 2019, 7:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.