కరోనా నియంత్రణలో దేశం మెరుగైన ఫలితాలు రాబడుతోందన్న కేంద్ర ప్రభుత్వ వాదనను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఖండించారు. కొవిడ్-19 పోరులో దేశం మంచి స్థితిలో ఉందా అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు వివిధ దేశాల్లో కరోనా కేసులకు సంబంధించిన గ్రాఫ్‌ను ట్వీట్‌కు జతచేశారు. అమెరికా, దక్షిణ కొరియా, న్యూజిలాండ్ దేశాల్లో వైరస్ వ్యాప్తికి సంబంధించిన గణాంకాలతో భారత్‌ను పోల్చారు.
-
"India at good position in #COVID19 battle?" pic.twitter.com/HAJz7En6Wo
— Rahul Gandhi (@RahulGandhi) July 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">"India at good position in #COVID19 battle?" pic.twitter.com/HAJz7En6Wo
— Rahul Gandhi (@RahulGandhi) July 13, 2020"India at good position in #COVID19 battle?" pic.twitter.com/HAJz7En6Wo
— Rahul Gandhi (@RahulGandhi) July 13, 2020
'ప్రపంచం అభినందిస్తోంది'
మరోవైపు... కరోనాకు వ్యతిరేకంగా భారత్ చేస్తున్న విజయవంతమైన పోరాటాన్ని ప్రపంచదేశాలన్నీ అభినందిస్తున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం పేర్కొన్నారు.
"అత్యధిక జనాభా కలిగి దేశం భారత్. ఇలాంటి దేశం కరోనాను ఎలా కట్టడి చేయగలుగుతుందని చాలా మంది అనుమానించారు. కానీ ఈ విజయవంతమైన పోరు ఇప్పుడు ప్రపంచానికి సాక్ష్యంగా నిలిచింది."
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
దేశంలో కరోనా కేసుల సంఖ్య 8,78,254కి ఎగబాకింది. గత 24 గంటల్లో 28,701 కొత్త కేసులు నమోదు కాగా.. 500 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 23,174కి చేరింది.
ఇదీ చదవండి- దేశంలో 23 వేలు దాటిన కరోనా మరణాలు