ETV Bharat / bharat

విదేశీ పర్యటనలో రాహుల్​ గాంధీ.. ఇటలీకే! - విదేశీ పర్యటనలో రాహుల్​ గాంధీ

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లారని ఆ పార్టీ తెలిపింది. కొన్ని రోజులు పాటు ఆయన పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటారని కాంగ్రెస్​ ముఖ్య ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా స్పష్టం చేశారు. అయితే వ్యక్తిగత కారణాల వల్లే విదేశాలకు వెళ్లినట్టు పేర్కొన్నారు.

Rahul Gandhi leaves for abroad for short personal visit
వ్యక్తిగత పర్యటన నిమిత్తం విదేశాలకు రాహుల్
author img

By

Published : Dec 27, 2020, 9:42 PM IST

Updated : Dec 27, 2020, 9:53 PM IST

కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ.. ఆదివారం విదేశీ పర్యటనకు బయలుదేరారు. వ్యక్తిగత కారణాల మీద రాహుల్​ ఈ పర్యటనకు వెళ్లినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కొంతకాలం పాటు పార్టీ వ్యవహారాలకు రాహుల్​ దూరంగా ఉంటారని కాంగ్రెస్​ ముఖ్య ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా వెల్లడించారు. "చిన్న వ్యక్తిగత పర్యటన నిమిత్తం రాహుల్​ విదేశాలకు వెళ్లారు," అని సుర్జేవాలా మీడియాకు తెలిపారు. అంతకుమించి వివరాలేవీ ఆయన వెల్లడించలేదు.

అయితే రాహుల్ ఆదివారం​ ఉదయం ఖతార్​ ఎయిర్​వేస్​లో ఇటలీలోని మిలాన్​కు వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడ రాహుల్​ అమ్మమ్మ ఉంటారు. గతంలోనూ పలుమార్లు ఆయన అక్కడికి వెళ్లారు.

కాంగ్రెస్​ 136వ వ్యవస్థాపక దినోత్సవానికి ఒక్క రోజు ముందు గాంధీ ఈ పర్యటన చేపట్టారు.

ఇదీ చదవండి: 'దండం పెడుతున్నా.. ఆ చట్టాలు రద్దు చేయండి'

Last Updated : Dec 27, 2020, 9:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.