ETV Bharat / bharat

మోదీ పెద్దలకే చౌకీదార్:రాహుల్

ప్రధాని నరేంద్ర మోదీ 'చౌకీదార్​' ఎన్నికల ప్రచారంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. అందరినీ చౌకీదార్లను చేస్తానని ప్రధాని ఇంతకు ముందు ఎప్పుడూ చెప్పలేదని ఎద్దేవా చేశారు.

author img

By

Published : Mar 18, 2019, 6:05 PM IST

Updated : Mar 19, 2019, 8:00 PM IST

'వాళ్లకే మోదీ కాపలాదారు'
'వాళ్లకే మోదీ కాపలాదారు'
దేశంలోని ధనికులకు మాత్రమే మోదీ కాపాలదారని రాహుల్​ గాంధీ ఆరోపించారు. ఈ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకే అందరినీ కాపలాదారులను చేస్తున్నారని రాహుల్​ వ్యాఖ్యానించారు. తూర్పు కర్ణాటక కలబురిగిలో కాంగ్రెస్​ సభకు రాహుల్​ గాంధీ హాజరయ్యారు. ప్రధాని మోదీ చేపట్టిన 'చౌకీదార్'​ ప్రచారంపై విమర్శలు చేశారు. తాను 'ప్రధాని కాదు... కాపలాదారునని చెప్పుకునే మోదీ'... దేశంలో ప్రతి ఒక్కరినీ కపాలాదారులను చేయడమేంటని ఎద్దేవా చేశారు.

" నరేంద్ర మోదీ ఎవరికి కాపలాదారు?.. అనిల్​ అంబానీ, మెహుల్ చోక్సీ, నీరవ్​ మోదీ, లలిత్​ మోదీలకు మాత్రమే కాపలాదారు. 15 మంది వ్యాపారవేత్తలకు 3లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేశారు. రైతులకు ఒక్క రూపాయి సైతం రుణ మాఫీ చేయలేదు. ఎన్నికల అనంతరం దేశంలోని పేదలందరి బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయాలని కాంగ్రెస్​ నిర్ణయం తీసుకుంది."
-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

మోదీపెద్దలకే చౌకీదార్:రాహుల్

Intro:Body:Conclusion:
Last Updated : Mar 19, 2019, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.