ETV Bharat / bharat

'స్నేహితుల జేబులు నింపటంలోనే మోదీ ప్రభుత్వం బిజీ' - ప్రపంచ క్షుద్బాధా సూచీ

ప్రపంచ క్షుద్బాధ సూచీలో భారత్​ 94వ స్థానంతో సరిపెట్టుకున్న నేపథ్యంలో కేంద్రంపై విమర్శలు చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. స్నేహితుల జేబులు నింపటంలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం బిజీగా ఉందని.. అందుకే దేశంలో ఆకలి కేకలు పెరిగాయని ఆరోపించారు.

rahul gandhi
రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత
author img

By

Published : Oct 17, 2020, 2:35 PM IST

Updated : Oct 17, 2020, 3:45 PM IST

కేంద్ర ప్రభుత్వంపై మరోమారు తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్​ అగ్రనేత రాహూల్​ గాంధీ. తమ స్నేహితుల జేబులు నింపటంలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం బిజీగా ఉందని ఆరోపించారు. అందువల్లనే దేశంలో పేదలు ఆకలితో అలమటిస్తున్నారని పేర్కొన్నారు.

ప్రపంచ క్షుద్బాధ సూచీ-2020లో భారత్​ మొత్తం 107 దేశాల జాబితాలో 94వ స్థానం రావటంపై ఈ మేరకు విమర్శలు చేశారు రాహుల్​.

  • भारत का ग़रीब भूखा है क्योंकि सरकार सिर्फ़ अपने कुछ ख़ास ‘मित्रों’ की जेबें भरने में लगी है। pic.twitter.com/MMJHDo1ND6

    — Rahul Gandhi (@RahulGandhi) October 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" భారత్​లోని పేదలు ఆకలితో అలమటించటానికి కారణం.. ప్రభుత్వం తమ ప్రత్యేక స్నేహితుల జేబులను నింపటంలో బిజీగా ఉండటమే"

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

తన ట్వీట్​తో పాటు పాకిస్థాన్​(88), నేపాల్​(73), బంగ్లాదేశ్​(75)తో సహా పొరుగు దేశాల కంటే తక్కువ ర్యాంకును భారత్​ పొందినట్లు చూచించే గ్రాఫ్​ను ట్యాగ్​ చేశారు రాహుల్​.

హంగర్​ ఇండెక్స్​-2020 డేటా ప్రకారం.. భారత్​ తర్వాత 13 దేశాలు మాత్రమే ఉన్నాయి. అందులో ర్వాండా(97), నైజీరియా(98), అఫ్గానిస్థాన్​(99), లిబియా (102), మోజాంబిక్​(103), చాద్​(107) వంటి దేశాలు ఉన్నాయి.

ఇదీ చూడండి: అన్నార్తుల ఆకలి తీరేదెప్పుడు?

Last Updated : Oct 17, 2020, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.