భారీ వర్షాల కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారని అన్నారు రాహుల్. సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న వారికి అవసరమైన సహాయ సామగ్రి అందించాలని తన ఫేస్ బుక్ పేజీలో కోరారు. నిత్యావసర సరుకులు, తాగునీరు, దుప్పట్లు, దుస్తులు, పిల్లలకు అవసరమైన శానిటరీ నాప్కిన్స్ వంటివి అందించాలని కోరారు. మల్లప్పురం జిల్లాలోని సేకరణ కేంద్రానికి దాతలు సహాయ సామగ్రిని పంపాలని విజ్ఞప్తి చేశారు.
బాధితులకు నిత్యవసరాల పంపిణీ
వయనాడ్ కైతపోయిల్ శిబిరంలోని బాధితులను సోమవారం పరామర్శించారు రాహుల్ గాంధీ. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సహాయ సామగ్రిని పంపిణీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులకు ఫోన్ చేసి తగిన సహాయం అందించాలని కోరినట్లు తెలిపారు.
" వయనాడ్ పార్లమెంట్ సభ్యునిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫోన్ చేసి త్వరితగతిన సహాయం అందించాలని కోరాను. ప్రధానమంత్రికి కూడా ఫోన్ చేసి ఇక్కడి పరిస్థితులను వివరించాను. కేంద్ర ప్రభుత్వ మద్దతు అవసరమని తెలిపాను. ఈ విపత్కర పరిస్థితుల్లో మేమంతా మీకు మద్దతుగా నిలుస్తాం. కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు వయనాడ్‌లోని ప్రతిఒక్కరు కలిసికట్టుగా పనిచేయాలి. వరద సహాయక చర్యల్లో ముందుండాలని కాంగ్రెస్ కార్యకర్తలను కోరుతున్నాను. "
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు.
ఇదీ చూడండి: 'వారి బాధ చూస్తుంటే హృదయం ద్రవిస్తోంది'