ETV Bharat / bharat

'అంబానీ-అదానీ చట్టాల్ని రద్దు చేయాలి' - రాహుల్​గాంధీ

కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల్ని అంబానీ-అదానీ చట్టాలుగా అభివర్ణించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. వెంటనే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదన ముందుకు తెచ్చినా అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.

rahul alleges ambani adani laws should be abolished
'అంబానీ-అదానీ చట్టాల్ని రద్దు చేయాలి'
author img

By

Published : Dec 7, 2020, 2:06 PM IST

దేశ రాజధానిలో ఆందోళన చేస్తున్న రైతులకు వివిధ పార్టీల నాయకులు అండగా నిలుస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాల్ని 'అంబానీ-అదానీ చట్టాలు'గా అభివర్ణించిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అంతకు మించి ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనను ముందుకు తెచ్చినా అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.

కేజ్రీవాల్‌ మద్దతు

మరోవైపు రైతుల డిమాండ్లకు తాము పూర్తిగా మద్దతిస్తున్నామని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రకటించారు. అన్నదాతలు ఆందోళన చేపట్టిన తొలిరోజు నుంచి తమ ఆమ్ ఆద్మీ పార్టీ వారికి అండగా నిలబడిందన్నారు. రైతుల పిలుపు మేరకు డిసెంబరు 8న జరగనున్న భారత్‌ బంద్‌కు ఆప్‌ సంపూర్ణ మద్దతునిస్తోందని పునరుద్ఘాటించారు.

కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల్లో అనేక సందేహాలు లేవనెత్తాయని ఎన్సీపీ అభిప్రాయపడింది. వీటితో అన్నదాతల్లో తీవ్ర అభద్రతాభావం నెలకొందని పేర్కొంది. కనీస మద్దతు ధర విషయంలో రైతుల సందేహాలను నివృత్తి చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడింది.

ఇదీ చదవండి: రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపిన దిల్లీ సీఎం

ఇదీ చదవండి: భారత్​ బంద్​కు మద్దతుగా విపక్షాల సంయుక్త ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.