ETV Bharat / bharat

వాయుసేన గగన విన్యాసాల్లో రఫేల్‌ - Indian Airforce 88th anniversary day

భారత వైమానిక దళంలో ప్రధానస్త్రంగా భావిస్తోన్న రఫేల్​ యుద్ధ విమానాలు త్వరలోనే ప్రజా సందర్శనకు రానున్నాయి. ఈ నెల 8న వాయుసేన దినోత్సవం సందర్భంగా.. యూపీలో నిర్వహించే పరేడ్​లో రఫేల్​ విమానాలు విన్యాసం చేయనున్నట్టు ఐఏఎఫ్​ తెలిపింది.

Rafale jets to take part in Air Force Day Parade in UP
వాయుసేన గగన విన్యాసాల్లో రఫేల్‌
author img

By

Published : Oct 3, 2020, 9:05 PM IST

భారత వైమానిక దళంలో కొత్తగా చేరిన ప్రతిష్ఠాత్మక రఫేల్‌ యుద్ధ విమానాలు త్వరలోనే ప్రజా సందర్శనకు రానున్నాయి. అక్టోబరు 8న వాయుసేన దినోత్సవం సందర్భంగా.. నిర్వహించే పరేడ్‌లో రఫేల్‌ విమానాలు పాల్గొననున్నాయి. ఈ మేరకు ఐఏఎఫ్‌ ట్విట్టర్​ వేదికగా వెల్లడించింది. ఉత్తర్​ప్రదేశ్​లోని హిందాన్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో జరిగే వైమానికదళ 88వ వార్షికోత్సవ పరేడ్‌లో రఫేల్‌ విమానాలు విన్యాసాలు చేయనున్నట్లు ప్రకటించింది ఐఏఎఫ్‌.

ఫ్రాన్స్‌ నుంచి 36 రఫేల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత్‌ 2016లో ఒప్పందం కుదుర్చుకుంది. తొలి విడతలో భాగంగా ఐదు రఫేల్‌ విమానాలు గత నెల భారత్‌కు చేరుకున్నాయి. సెప్టెంబరు 10న అంబాలా ఎయిర్‌బేస్‌లో ఈ విమానాలను లాంఛనంగా వైమానిక దళంలో చేర్చారు. ప్రస్తుతం ఈ యుద్ధ విమానాలు 17వ స్క్వాడ్రన్‌లో భాగంగా లద్దాఖ్‌లో పనిచేస్తున్నాయి.

ఇదీ చదవండి: 'అణ్వాయుధ నిర్మూలనలో భారత్​ది​ కీలక పాత్ర'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.