ETV Bharat / bharat

పంజాబ్​: భయానక పేలుడులో 23 మంది మృతి

పంజాబ్​ బతాలా నగరంలోని బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ భయానక ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి స్థానికులు బెంబేలెత్తిపోయారు.

author img

By

Published : Sep 4, 2019, 5:43 PM IST

Updated : Sep 29, 2019, 10:41 AM IST

పంజాబ్​ బాణాసంచా కర్మాగారంలో ప్రమాదం..13 మంది మృతి
పంజాబ్​లో భయానక పేలుడు

పంజాబ్​లోని గురుదాస్​పుర్​ జిల్లా బతాలా నగరంలో భయానక అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక బాణసంచా కర్మాగారంలో పేలుడు ధాటికి 23 మంది మృతిచెందారు. 27 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. శిథిలాల కింద మరి కొంతమంది చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

జాతీయ విపత్తు నిర్వహణ బృందం (ఎన్డీఆర్​ఎఫ్​)తో పాటు రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం(ఎస్​డీఆర్​ఎఫ్​) ప్రమాదంలో చిక్కుకున్న వారికోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో చనిపోయిన వారంతా కార్మికులేనని అధికారులు తెలిపారు. రేపు జరిగే గురునానక్‌దేవ్‌ వివాహ మహోత్సవం కోసం బాణసంచా తయారు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.

ముఖ్యమంత్రి విచారం

ఈ దుర్ఘటనపై పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను డిప్యూటీ కమిషనర్​, ఎస్​ఎస్​పీ పర్యవేక్షిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.

తునాతునకలైన భవనం..ఎగిరిపడ్డ వాహనాలు

బాణసంచా కర్మాగారంలో పేలుడు ధాటికి ఆ భవనం తునాతునకలయ్యింది. భారీ శబ్దాలకు స్థానికులు బెంబేలెత్తిపోయారు. సమీపంలోని కార్లు ఎగిరిపడ్డాయి.

ప్రమాదంలో గాయపడిన వారి ఆర్తనాదాలకు స్థానికులు చలించిపోయారు. తీవ్రగాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించేందుకు సహకరించారు.

Srinagar, Sep 04 (ANI): Chinar Corps Commander, Lieutenant General KJS Dhillon addressed students in Srinagar and wished them a good future. He requested them to stay away from drugs and guns. While addressing them, he said, "I wish you a very good future. I request you to study hard, stay away from drugs, stay away from guns. Concentrate on your studies, make a future for yourself. Make your parents and teachers proud."
Last Updated : Sep 29, 2019, 10:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.