మహారాష్ట్రలోని పుణెలో ప్రహారి గోడ కూలి 15 మంది మరణించిన ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించిన ముఖ్యమంత్రి... నిందితులను కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు ట్వీట్ చేశారు.
"ఈ ఘటన ఎంతో బాధ కలిగించింది. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ఆశిస్తున్నా. ఘటనపై దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించా."
--- దేవేంద్ర ఫడణవిస్ , మహారాష్ట్ర ముఖ్యమంత్రి
మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం.
ఇదీ జరిగింది...
శుక్రవారం రాత్రి 1.45 గంటల ప్రాంతంలో కొంఢ్వా ప్రాంతంలో భవన నిర్మాణ కూలీల కోసం వేసిన తాత్కాలిక షెడ్లపై గోడ కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న కూలీలు కూలీలు ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి- యూపీలో రౌడీలదే రాజ్యం: ప్రియాంక