మహారాష్ట్ర- పుణెలో దారుణ ఘటన జరిగింది. టీవీ చూస్తున్న ఓ బాలుణ్ని తన తల్లి మందలించింది. దీనిని జీర్ణించుకోలేని ఆ బాలుడు ఏకంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబానికి శాశ్వతంగా దూరమైపోయాడు.
ఏం జరిగిందంటే.?
కరోనా తెచ్చిన సెలవులతో.. బిబ్వేవాడీలోని ఆదర్శ్ చౌల్ ప్రాంతంలో ఓ 14 ఏళ్ల బాలుడు సుదీర్ఘంగా టీవీకే పరిమితమయ్యాడు. ఇది గమనించిన అతడి తల్లి కోపంతో.. టీవీ ఆపుచేయమంది. అయినా అతడు వినిపించుకోలేదు. ఈసారి గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్న ఆ అమ్మ.. కాస్త మందలిస్తూ, తనే టీవీ స్విచ్ ఆఫ్ చేసింది. ఇంతటితో ఆగ్రహానికి లోనై పై గదిలోకి వెళ్లిన బాలుడు.. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఇదీ చదవండి: విడాకులు తీసుకున్న మహిళలే అతడి టార్గెట్.. చివరికి!