జమ్ముకశ్మీర్ పుల్వామాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో డాదురా ప్రాంతంలో పోలీసులు, సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు జరపగా.. బలగాలు ప్రతిఘటించాయి.
అయితే, ముష్కరులు ఏ సంస్థకు చెందినవారో గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇంకా సోదాలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఒక్కరోజు వ్యవధిలో దక్షిణ కశ్మీర్లో జరిగిన రెండో ఎన్కౌంటర్ ఇది. అంతకుముందు కుల్గామ్‌లో జరిగిన మరో ఎన్కౌంటర్లోనూ ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
ఇదీ చూడండి: భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం