ETV Bharat / bharat

బహిరంగ ప్రదేశాల్లో నిరసనలపై సుప్రీం కీలక తీర్పు - సీఏఏ

Public roads and places cannot be occupied indefinitely by protesters says Supreme Court
బహిరంగ ప్రదేశాల్లో నిరసనలపై సుప్రీం కీలక తీర్పు
author img

By

Published : Oct 7, 2020, 11:30 AM IST

Updated : Oct 7, 2020, 1:30 PM IST

12:19 October 07

'ప్రభుత్వ స్థలాలను నిరవధికంగా ఆక్రమించుకోరాదు'

షాహిన్​బాగ్​ లాంటి ప్రభుత్వ స్థలాలను నిరసనల కోసం ఆక్రమించుకోవడం అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. అలాంటి ప్రదేశాలను నిరవధికంగా ఆక్రమించుకోరాదని సూచించింది.

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గతేడాది డిసెంబర్​లో జరిగిన నిరసనల్లో దిల్లీలోని షాహిన్​బాగ్​ ప్రాంతాన్ని ఉపయోగించుకున్న తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నిరసనల సందర్భంగా రహదారులను ఆక్రమించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్​పై జస్టిస్ ఎస్​కే కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

షాహిన్​బాగ్​ ప్రాంతం నుంచి నిరసనకారులను తప్పించేందుకు దిల్లీ పోలీసులు చర్యలు తీసుకోవాల్సిందని అభిప్రాయపడింది అత్యున్నత న్యాయస్థానం. ఇలాంటి సమయంలో కోర్టు ఆదేశాల కోసం ఎదురుచూడకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలిపింది. నిరసనల సందర్భంగా ప్రజాస్వామ్యం, భిన్నాభిప్రాయం చేతిలో చేయి వేసుకుని నడిచాయని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

11:26 October 07

కోర్టు ఆదేశాల కోసం ఎదురుచూడొద్దు: సుప్రీం

షాహిన్ బాగ్ నిరసనలపై ఇవాళ కీలక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. అనుమతించిన ప్రాంతాల్లోనే నిరసనలు చేయాలని జస్టిస్ ఎస్‌.కె.కౌల్ ధర్మాసనం స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాలు, రోడ్లను నిరవధికంగా మూసివేస్తూ నిరసనలు చేయకూడదని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

నిరసనలు, ఇతర హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండాలన్న సుప్రీంకోర్టు.. బహిరంగ ప్రదేశాల్లో నిరసనలను సంబంధిత అధికారులు తొలగించాలని చెప్పింది. ఇందుకోసం కోర్టు ఆదేశాల కోసం ఎదురుచూడనవసరం లేదని అభిప్రాయపడింది.

Last Updated : Oct 7, 2020, 1:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.