ETV Bharat / bharat

మనుషులను చంపడమే పనిగా పెట్టుకున్న ఉన్మాది - సైకో కిల్లర్​

ఉత్తరప్రదేశ్​లోని ఎటా జిల్లాలో ఓ సైకో.. సొంత అన్నను చంపడానికి ప్రయత్నిస్తుండగా కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. పోలీసులకు అప్పగించారు. విచారణలో భాగంగా... ఇప్పటికే రెండు హత్యలు చేసినట్టు సైకో ఒప్పుకున్నాడు. తనకు మనుషులను చంపడమంటే ఇష్టమని ఆ ఉన్మాది చెప్పడం వల్ల పోలీసులు నివ్వెరపోయారు.

Psycho killer held in Uttar Pradesh, said 'liked' killing people
ఆ సైకోకు మనుషులను చంపడమంటే ఎంతో ఇష్టం
author img

By

Published : Jun 14, 2020, 1:53 PM IST

ఉత్తరప్రదేశ్​లోని ఓ సైకో.. సొంత అన్ననే చంపడానికి ప్రయత్నించాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పటికే ఇద్దరిని చంపినట్టు, మరో ముగ్గురిని హత్యచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు ఆ ఉన్మాది. ఇలా హత్యలు చేయడమంటే తనకు ఎంతో ఇష్టమని ఆ సైకో చెప్పడం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.

'చంపడమంటే ఇష్టం...'

ఎటా జిల్లాలోని ధర్మపుర్​ గ్రామవాసి రాధేశ్యామ్​. ఇంటర్​ పూర్తి చేసుకున్న అతను ఇదివరకే తన బంధువుల పిల్లలైన ఆరేళ్ల సత్యేంద్ర, ఐదేళ్ల ప్రశాంత్​ను హతమార్చాడు.

జూన్​ 11వ తేదీన సొంత అన్ననే హత్యచేయడానికి సిద్ధపడ్డాడు శ్యామ్​. అన్న విశ్వనాథ్​ సింగ్​ నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో చంపాలని తన గదిలోకి వెళ్లాడు. అదే సమయానికి కుటుంబసభ్యులు రాధేశ్యామ్​ను పట్టుకున్నారు. విశ్వనాథ్​ త్రుటిలో ప్రాణాలు కాపాడుకున్నాడు. చివరికి శ్యామ్​ను పోలీసులకు అప్పగించారు.

విచారణలో భాగంగా.. మనుషులను చంపడమంటే తనకు ఎంతో ఇష్టమని రాధేశ్యామ్​ చెప్పడం వల్ల పోలీసులు నివ్వెరపోయారు.

"ఇద్దరు బంధువుల పిల్లల్ని చంపినట్టు నిందితుడు అంగీకరించాడు. మరో ముగ్గురిని చంపడానికి కూడా ప్రణాళికలు రచించినట్టు వెల్లడించాడు. మనుషులను చంపి ఆనందించే సైకో ఈ రాధేశ్యామ్​."

-- సునీల్​ కుమార్​, ఎటా ఎస్​పీ.

శనివారం ఆ ఉన్మాదిని మెజిస్ట్రేట్​ వద్ద హాజరుపరిచారు పోలీసులు. అనంతరం జైలుకు తరలించారు.

అయితే సత్యేంద్ర హత్య కేసులో ఇదివరకు ముగ్గురిని జైలుకు తరలించారు పోలీసులు. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. ప్రశాంత్​ హత్య కేసులో మరో ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. తాజాగా రాధేశ్యామ్​ నేరాన్ని అంగీకరించడం వల్ల వారిపై ఉన్న ఎఫ్​ఐఆర్​ను రద్దు చేయనున్నారు. త్వరలోనే వారిని విడుదల చేయనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.