ETV Bharat / bharat

బిహార్​ బరి: 'రాబిన్​ హుడ్'​​ ప్రభావమెంత ? - నితీశ్​ కుమార్

బిహార్ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరిగిపోతోంది. పార్టీలు ప్రచార జోరుతో హోరెత్తిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బిహార్​లో మాస్​ నేతగా పేరు తెచ్చుకున్న పప్పూ యాదవ్... జన్ అధికార్ పార్టీ(జేఏపీ)తో ప్రజల ముందుకొచ్చారు. నితీశ్​ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తానొక ఊహించని క్షిపణినని, అందరూ అప్రమత్తంగా ఉండాలని 'ఈటీవీ భారత్​' బిహార్​ బ్యూరో చీఫ్​ అమిత్​ భేలారీతో చెప్పుకొచ్చారు.

Pappu Yadav Bihar
బిహార్​ బరి: రసవత్తర పోరులో రాబిన్​ హుడ్​​ ప్రభావమెంత ?
author img

By

Published : Oct 11, 2020, 2:07 PM IST

పప్పూ యాదవ్​ బిహార్ రాజకీయాల్లో సుపరిచిత నేత. గతంలో 5 సార్లు ఎంపీగా.. ఒకసారి ఎమ్మెల్యేగా పని చేశారు ఈ ఆర్​జేడీ మాజీ నాయకుడు. ప్రస్తుతం 2020 ఎన్నికలకు సొంతంగా జన్​ అధికార్​ పార్టీ పేరుతో ముందుకొచ్చారు. భావసారుప్యత కలిగిన 9 పార్టీలతో జట్టుకట్టి బిహారీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఈ బిహార్​ మాస్​ నేత, రాబిన్​ హుడ్​గా పేరుగాంచిన నాయకుడు.. ఊహించని, ఊహకందని మిస్సైల్​గా అభివర్ణించుకుంటున్న పప్పూ యాదవ్​ ప్రభావం బిహార్​ రాజకీయాలపై ఎంత వరకు ఉండనుంది ?

అనతికాలంలోనే..

ఉన్నతమైన కుటుంబం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పప్పూ యాదవ్.. అనతికాలంలోనే బిహార్​లో కీలక నేతగా ఎదిగారు. దిల్లీలో ఉన్నత విద్య అభ్యసించిన ఆయన అసలు పేరు రాజేశ్​ రాజన్​.

పేదలకు సాయం చేసే స్వభావం ఉన్న పప్పూ యాదవ్​.. కోసీ ప్రాంతం గొంతుకగా మారారు. 1990లోనే పప్పూయాదవ్​, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సింఘేసర్థ్సాన్​ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం పుర్ణియా లోకసభ స్థానానికి 1991, 96, 99లో వరసగా 3సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. తర్వాత ఆర్​జేడీ టికెట్​ దక్కించుకుని 2004, 2014లో విజయం సాధించారు.

గ్రామీణ ప్రాంతాల ప్రజలు పప్పూ యాదవ్​ను డాన్​గా, రాబిన్​ హుడ్​గా చూస్తారు. అవసరం ఉన్న వాళ్లను ఆదుకోవటం తన విధి అంటున్నారు పప్పూ యదవ్​. 1994లో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ రంజిత రాజన్​ను వివాహం చేసుకున్నారు.

ప్రక్షాళనే లక్ష్యం!

ప్రస్తుతం అవినీతిలో కూరుకుపోయిన వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడటమే తన విధి అంటున్నారు పప్పూ యాదవ్​. అదే సమయంలో అధికార పక్షంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఓట్ల కోసం నితీశ్​ కుమార్​ పాకులాడుతున్నారని ఆరోపిస్తున్నారు. తన దూకుడు యువతకు నచ్చుతుందని చెబుతూనే.. యువ నేత తేజస్వీ యాదవ్​పై విరుచుకుపడుతున్నారు.

పప్పూ యాదవ్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి

ఆర్​జేడీతో విభేదాలు

ఆర్​జేడీలో ఉన్న సమయంలోనూ పప్పూ యాదవ్ పార్టీతో విభేదించిన సందర్భాలు చాలా ఉన్నాయి. లాలూ మాట తప్ప పార్టీలో వేరెవరి మాటా విననంటూ ఆయన ప్రకటనలు సైతం చేశారు. బిహార్​ మాజీ ముఖ్యమంత్రి జీతన్​ రాం మాంఝీని 'అసమర్థ' నేతగా అభివర్ణించిన సందర్భాలు ఉన్నాయి.

ప్రస్తుతం కూటమి కట్టిన పార్టీలకు నాయకుడిగా వ్యవహరిస్తున్న పప్పూ యాదవ్​.. అధికారం పక్షం నేతలు నితీశ్​ కుమార్​, సుశీల్​ కుమార్​ మోదీపై విరుచుకుపడుతున్నారు.

బిహార్​లో వరదలు పొటెత్తినపుడు రాష్ట్ర​ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని చోద్యం చూశారు. ఆ సమయంలో నేనే కష్టపడి పని చేశాను. ప్రజలకు ఆహారం, మందులు అందించాను. బిహార్​ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిద్దరూ కాడి వదిలేశారు. పప్పూ యాదవ్​ ఒక్కడే వారి వద్దకు వెళ్లి.. కష్టాలు తెలుసుకున్నాడు. నేను బిహార్​ పుత్రుడిని. ప్రజలకు ఎప్పుడూ రుణపడే ఉంటాను.

రాష్ట్ర రాజకీయాల్లో ఓట్ల కోసం పాకులాడే వ్యక్తుల జాబితాలో నితీశ్​ కుమార్ తర్వాతే ఇంకెవరైనా. బిహార్​ ప్రజలు ఇప్పటికే 15 ఏళ్ల లాలూ పాలన, మరో 15 ఏళ్లు నితీశ్​ పాలన చూశారు. కానీ ఇప్పుడు నాయకత్వంలో మార్పు రావాలి. కేవలం 3ఏళ్లు అధికారం ఇవ్వమనండి మార్పంటే చూపిస్తాం.

-పప్పూ యాదవ్​, జన్​ అధికార్​ పార్టీ అధినేత

ఈ నేపథ్యంలోనే పప్పూ యాదవ్​.. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ప్రోగ్రెసివ్​ డెమొక్రటిక్​ అలయన్స్(పీడీఏ) తరఫున 243 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టారు.

పప్పూ యాదవ్​ ప్రభావం బిహార్​ రాజకీయాల్లో ఎంత మేరకు ఉంటుందనేది మరో నెలలో తేలనుంది. అయితే, గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో పప్పూ యాదవ్​ పార్టీ అభ్యర్థులందరూ డిపాజిట్లు కోల్పోవటం కొసమెరుపు.

ఇదీ చూడండి: బిహార్ ​బరి: పద్మవ్యూహాన్ని తలపిస్తున్న‌ రాజకీయం..!

ఇదీ చూడండి: బిహార్​ బరి: వామపక్షాలు అస్థిత్వం కాపాడుకునేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.