ETV Bharat / bharat

'ఎయిర్​సెల్'​ డొంక లాగితే 'ఐఎన్​ఎక్స్'​ బట్టబయలు! - సీబీఐ

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసు.. ప్రస్తుతం చిదంబరం మెడకు ఉచ్చు బిగించింది. ఈ కేసు 2016లో వెలుగులోకి వచ్చింది. అయితే ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ ఎయిర్​సెల్​ మ్యాక్సిస్​ కేసును దర్యాప్తు చేస్తోన్న సమయంలోనే ఈ ఐఎన్​ఎక్స్​ మీడియా వ్యవహారం బయటపడింది.

'ఎయిర్​సెల్'​ డొంక లాగితే 'ఐఎన్​ఎక్స్'​ బట్టబయలు!
author img

By

Published : Aug 23, 2019, 5:11 AM IST

Updated : Sep 27, 2019, 11:00 PM IST

కాంగ్రెస్​ సీనియర్​ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని ఐఎన్​ఎక్స్​ కేసులో సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే ఐఎన్​ఎక్స్​ మీడియా కేసు వెలుగులోకి రావడానికి కారణం ఎయిర్​సెల్​ మ్యాక్సిస్​ కేసు. ఈ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోన్న సందర్భంలో ఇదే తరహా అనుమతులు ఐఎన్ఎక్స్​ మీడియా సంస్థకు ఇచ్చినట్లు తేలింది.

ఎయిర్​సెల్​ మ్యాక్సిస్​ కేసు...

చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు.. భారత్‌లోని ఎయిర్‌సెల్ టెలి కమ్యూనికేషన్స్ కంపెనీలో పెట్టుబడులు వచ్చాయి. మారిషస్‌కు చెందిన మ్యాక్సిస్ అనుబంధ సంస్థ 'గ్లోబల్ కమ్యూనికేషన్ సర్వీసెస్ హోల్డింగ్ లిమిటెడ్' ఈ పెట్టుబడులు పెట్టింది. అయితే ఇందుకు అనుమతులు రావడంలో చిదంబరంపై ఆరోపణలు వచ్చాయి.

ఆర్థిక మంత్రిగా రూ. 600 కోట్ల వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతులిచ్చేందకు ఆయనకు అధికారాలు ఉన్నాయి. అయితే ఆయన ఎయిర్‌సెల్‌లోకి మ్యాక్సిస్ నుంచి రూ. 3500 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించారంటూ సీబీఐ అభియోగాలు నమోదు చేసింది.

రూ. 600 కోట్లు దాటితే ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ పరిశీలనకు పంపించాల్సి ఉన్నా అదేమీ లేకుండా చిదంబరం నుంచి క్లియరెన్స్ వచ్చిందన్నది ఆరోపణ.

ఐఎన్​ఎక్స్​ కేసు...

చిదరంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలోనే ఐఎన్ఎక్స్ మీడియా సంస్థలోకి రూ. 305 కోట్ల విదేశీ నిధులు నిబంధనలకు విరుద్ధంగా చేరాయన్నది ఆరోపణ. ఇందుకు వీలుగా విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు అనుమతులివ్వడం వెనుక అవకతవకలున్నాయని అభియోగాలు ఉన్నాయి. ఇందులో ఆయన కుమారుడు కార్తి చిదంబరం ప్రమేయం ఉందని 2017 మే 15న సీబీఐ కేసు నమోదు చేసింది.

ఏంటి సంబంధం..?

ఎయిర్​సెల్​ మ్యాక్సిస్​ కేసులో చిదంబరం ఇచ్చిన అనుమతులపై ఈడీ దర్యాప్తు చేస్తున్నప్పుడు మరికొన్ని అనుమతులపై అనుమానాలు వచ్చాయి.

2016 డిసెంబర్​లో అప్పటి ఈడీ జాయింట్​ డైరెక్టర్​ రాజేశ్వర్​ సింగ్​ సీబీఐ డైరెక్టర్​కు ఎయిర్​సెల్​ మ్యాక్సిస్​ కేసు దర్యాప్తు విషయంలో ఓ లేఖ రాశారు. దర్యాప్తులో దొరికిన పలు ఆధారాలు మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయని వెల్లడించారు.

2017 మే 15న ఈడీ లేఖ ఆధారంగా ఐఎన్​ఎక్స్​ మీడియా ఒప్పందంపై సీబీఐ కేసు నమోదు చేసింది. 3 రోజుల అనంతరం సీబీఐ ఎఫ్​ఐఆర్​ ఆధారంగా ఐఎన్​ఎక్స్​ మీడియా వ్యవహారంపై ఈడీ నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది.

లేఖలో ఏముంది?

కార్తీ చిదంబరానికి చెందిన 'అడ్వాంటేజ్‌ స్ట్రాటజిక్‌ కన్సల్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌' (ఏఎస్‌సీపీఎల్‌) కంపెనీకి పలు సంస్థల నుంచి ముడుపులు అందాయని ఈడీ పేర్కొంది.

ఈ సంస్థలన్నింటికీ అప్పటి ఆర్థిక మంత్రిత్వశాఖ.. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు అనుమతులను జారీ చేసిందని ఈడీ తెలిపింది. ఈ అనుమతులు ఇవ్వడానికే ఏఎస్​సీపీఎల్​కు భారీ ముడుపులు ముట్టజెప్పారన్నది ప్రధాన అభియోగం.

Mysuru (Karnataka), Aug 22 (ANI): People of Karnataka's Mysuru started preparations for its 10-day festival 'Mysuru Dasara' from August 22. The festival starts with Navaratri and the lasts till Vijayadashami. The Mysuru Dasara is a tradition that Raja Wadiyar I, the ninth ruler of the Mysuru kingdom, is believed to have started in 1610. The festival attracts visitors from all over the world. The festival is observed on the tenth day in the Hindu calendar month of Ashvin, which typically falls in the Gregorian months of September and October.

Last Updated : Sep 27, 2019, 11:00 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.